Bengal Assembly: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన తీవ్ర ప్రకంపనలు రేపుతుంది. దీంతో పెద్ద ఎత్తున విమర్శల రావడంతో.. అసెంబ్లీలో ఇవాళ (మంగళవారం) బెంగాల్ సర్కార్ హత్యాచార నిరోధక బిల్లును తీసుకొచ్చింది. ‘అపరాజిత విమెన్ అండ్ చైల్డ్ బిల్లు’ పేరిట దానిని ప్రవేశ పెట్టింది. ఇందుకోసం ప్రత్యేక సెషన్‌ను కొనసాగించింది. ఇక, ఈ చర్చ అనంతరం దీనికి సభ్యులందరు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఈ బిల్లు చరిత్రాత్మకం.. తాము సీబీఐ నుంచి న్యాయం కోరుతున్నాం.. నిందితులకు మరణశిక్ష విధించాలని కోరుతున్నామని బెంగాల్ సీఎం పేర్కొన్నారు.
Read Also: BRS vs Congress: ఖమ్మంలో ఉద్రిక్తత.. హరీష్ రావు కారుపై రాళ్ల దాడి
ఇక, ఈ రోజు మేం ప్రవేశ పెట్టిన బిల్లుపై గవర్నర్ సంతకం చేయాలని విపక్షాలు అడగాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఆ తర్వాత దానిని అమలు చేసే బాధ్యత మాది అని పేర్కొన్నారు. ఈ బిల్లు ద్వారా కేంద్ర చట్టంలోని లోపాలను సరిద్దిద్దే ప్రయత్నం చేయబోతున్నాం.. సత్వర విచారణ, బాధితులకు న్యాయం దొరకడమే ఈ బిల్లు లక్ష్యం అన్నారు. ఒకసారి ఈ బిల్లు పాస్ అయితే.. ప్రత్యేక అపరాజిత టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని ఆమె వెల్లడించారు. అత్యాచారం లాంటి ఘటనలు మానవాళికి శాపాలుగా మారాయి.. ఇలాంటి ఘోరాలు జరగకుండా సామాజిక సంస్కరణలు తీస్కోని రావాలి.. యూపీ, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో మహిళలపై అసాధారణ స్థాయిలో నేరాలు కొనసాగుతున్నాయని మమతా బెనర్జీ మండిపడ్డారు.
Read Also: Every Day Peanuts: తరుచుగా పల్లీలను తింటే జరిగేది ఇదే..
అలాగే, ఉన్నావ్, హాథ్రస్ కేసుల్లో న్యాయం గురించి ఎవరూ మాట్లాడటం లేదు అని బెంగాల్ సీఎం మమతా అన్నారు. కానీ బెంగాల్‌లో మహిళలకు కోర్టుల్లో న్యాయం దొరుకుతుంది.. మీలాగా నేనూ కూడా ప్రధాన మంత్రి, హోంమంత్రులపై విమర్శలు చేస్తే ఎలా ఉంటుంది..? అంటూ ప్రశ్నించింది. మహిళ రక్షణ కోసం సమర్థవంతమైన చట్టాలు తీసుకురాలేని ముఖ్యమంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేయండి అని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీలో మృతురాలికి నివాళి అర్పించారు. హత్యాచార ఘటనపై మమత ప్రభుత్వాన్ని విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తోన్న సందర్భంగా ఈ బిల్లుకు మద్దతు ఇచ్చాయి.