నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా కడపకు చేరుకొని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీడీవోను పరామర్శించనున్నారు. అనంతరం గాలివీడుకు రోడ్డు మార్గాన వెళ్లనున్నారు. గాలివీడులో ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన పరిశీలించనున్నారు.
* నేటి ఉదయం 11.45 గంటలకు మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు.. అధికారిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు.. ఉదయం 8గంటలకు మన్మోహన్ నివాసం నుంచి ఏఐసీసీ కార్యాలయానికి పార్థివదేహం తరలింపు.. ఉదయం. 8.30 నుంచి 9.30 వరకు ఏఐసీసీ కార్యాలయంలోనే పార్థివదేహం.. నివాళులర్పించనున్న కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు.. ఉదయం. 9.30 గంటలకు ప్రారంభంకానున్న మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర.. * నేడు కడప జిల్లాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించనున్న పవన్.. వైసీపీ […]
Abdul Rehman Makki: ముంబై ఉగ్రదాడి కుట్రదారు, లష్కరే తోయిబా (ఎల్ఈటీ) డిప్యూటీ చీఫ్ హఫీజ్ అబ్దుల్ రహ్మాన్ మక్కీ ఈరోజు పాకిస్థాన్‌లో గుండెపోటుతో మరణించారు. అయితే, గత కొద్ది రోజులుగా లాహోర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మధుమేహ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతూ.. ఈ రోజు తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారని జమాత్-ఉద్-దవా అధికారి ధృవీకరించారు.
China–Russia: గత మూడేళ్లుగా రష్యా- ఉక్రెయిన్ల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రష్యా పర్యటనకు సిద్ధం అయ్యారు. ఈ మేరకు బీజింగ్‌లోని రష్యా రాయబారి ఇగోర్ మోర్గులోవ్ వెల్లడించారు.
Congress: భారత మాజీ ప్రధాన మంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్ సింగ్ భౌతికకాయం వద్ద కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, లోక్ సభలో విపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఘన నివాళులు అర్పించారు.
తమిళనాడు బీజేపీ చీఫ్ కె.అన్నామలై ఆరు కొరడా దెబ్బలు కొట్టించుకుని.. మురుగన్‌కు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా డీఎంకే ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ.. రాష్ట్రంలో స్టాలిన్ సర్కార్ ను గద్దె దించేందుకు ఇవాళ్టి నుంచి 48 గంటల పాటు ఉపవాస దీక్ష చేస్తానని శపథం చేశారు.
మీడియాతో మాట్లాడటానికి భయపడిన ప్రధాన మంత్రిని కాదు.. నేను క్రమం తప్పకుండా ప్రెస్ తో మాట్లాడాను అని మన్మోహన్ సింగ్ తెలియజేశారు. నేను చేపట్టిన ప్రతి విదేశీ పర్యటన సమయంలో మీడియా సమావేశం నిర్వహించాను అని వెల్లడించారు.
ఈరోజు (డిసెంబర్ 27) ఆయన పార్థివదేహానికి ప్రధాని నరేంద్ర మోడీ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ యెమెన్‌లో గల సనాలోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమానం ఎక్కేందుకు వేచి ఉండగా వైమానిక బాంబు దాడి జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించాగా.. పలువురికి గాయాలు అయ్యాయి.
Union Cabinet: నేడు ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు క్యాబినెట్ సంతాపం తెలపనుంది. అలాగే, మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రేపు (డిసెంబర్ 28) ఢిల్లీలో జరగనుండగా.. కేంద్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించబోతున్నట్లు తెలిపింది.