CM Revanth Reddy: కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై అధికారులతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా గోషామహల్ లో ప్రతిపాదిత స్థలానికి సంబంధించి శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ధరణి పేరుతో కొంప ముంచారు.. ఈ ధరణితో ఒక కుటుంబంతో పాటు కొందరే లాభపడ్డారు అని వెల్లడించారు. దళితులకు ఇచ్చిన భూముల్లోనే శ్మశానాలు, పోలీస్ స్టేషన్లు, ఫైర్ స్టేషన్లు ప్రభుత్వ కార్యాలయాలు కట్టారు.. కబ్జాకు గురైనా భూములు స్వాధీనం చేయడంలో అధికారులు వెనకడుగు వేయొద్దు.. మా సహాకారం ఎల్లప్పుడూ ఉంటుంది అని బండి సంజయ్ తెలిపారు.
ప్రతి తండాలో గ్రామ పంచాయతీ భవనం, అంగన్వాడి స్కూల్, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాల, హాస్పిటల్ ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది.. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం అదే.. 2029లో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారు.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Deputy CM Bhatti: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ లో ఆదివాసి ప్రజా ప్రతినిధుల సాధికారత శిక్షణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీల కోసం చట్టాలు చేసి వాటిని అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఇక, చట్టాలను అమలు చేయించుకునే బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు.
రైతు బంధు ఇవ్వలేదని, ఇళ్లు ఇవ్వలేదని మాజీ ముఖ్యమంత్రి టీం దుష్ప్రచారం చేస్తుంటుంది.. వారి అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు అని చెప్పారు. అలాగే, యోగ్యమైన భూమి ఉన్న వారందరికీ రైతుబంధు అందిస్తాం.. కానీ, రియల్ ఎస్టేట్ భూములకి మాత్రం ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం చెల్లించదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
Sangareddy SP: ఆల్ఫాజోలం తయారీ ముఠా గుట్టు రట్టు చేసిన సంగారెడ్డి పోలీసులు.. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ.. గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వారాల కింద 350 గ్రాముల అల్ఫాజోలం పట్టుకున్నాం.. పట్టుబడ్డ అల్ఫాజోలం కోసం విచారణ చేస్తే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Transport Officer: NTVతో రంగారెడ్డి జిల్లా ఉప రవాణా శాఖ అధికారి సదానందం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై గత మూడో రోజులుగా తనిఖీలు కొనసాగిస్తున్నామని తెలిపారు.
Nalgonda Intelligence SP: నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై వేటు పడింది. ఆమెను డీజీపీ ఆఫీసుకి ఎటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అక్రమాలు, వసూళ్ల ఆరోపణలతో ఆమెపై ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
Online Betting: వరంగల్ జిల్లాలో ఆన్ లైన్ బెట్టింగ్తో మరో యువకుడు బలి అయ్యాడు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో అనే లైశెట్టి రాజు కుమార్ (26) అనే యువకుడు.. ఆన్ లైన్ బెట్టింగులో సుమారు 30 లక్షల రూపాయలు పోగొట్టుకోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Arogyashri: కార్పొరేట్ హాస్పిటల్స్లో యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నాయి. శుక్రవారం నాడు ఆరోగ్యశ్రీ సీఈవోకు లేహాస్పిటల్స్ అసోసియేషన్ ఖ రాసింది. ఆరోగ్యశ్రీ చరిత్రలోనే ఈ సంవత్సర కాలంలో అత్యధికంగా రూ. 1130 కోట్లు హాస్పిటల్స్కు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు.