Rammohan Naidu: కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రజల బడ్జెట్ అని భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. రూ. 12 లక్షల వరకూ మధ్య తరగతి ప్రజలకి ఆదాయపు పన్నులో ఊరట ఇవ్వడం శుభ పరిణామం అన్నారు.
రాజీవ్ శుక్లా తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు. మహేంద్ర సింగ్ ధోనీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం అతడి వ్యక్తిగతం అన్నారు. అయితే, బెంగాల్ రాజకీయాల్లోకి వస్తారని నేను అనుకున్నాను.. ఎంఎస్ ధోనీ రాజకీయాల్లో కూడా బాగా రాణించగలడు.
Childrens Missing: విశాఖపట్నంలో ముగ్గురు చిన్నారుల అదృశ్యం కలకలం రేపుతుంది. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వేపగుంట ముచ్చమాంబ కాలనీకి చెందిన ఈ చిన్నారులు అదృశ్యం అయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.
Gaurav Gogoi: లోక్ సభలో ఈరోజు (ఫిబ్రవరి 1) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన 2025-26 బడ్జెట్‌పై కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ రియాక్ట్ అయ్యారు. బడ్జెట్లో ఏ మాత్రం పస లేదని మండిపడ్డారు. గడిచిన పదేళ్లలో ఇదే అత్యంత బలహీనమైన బడ్జెట్ అంటూ అతడు విమర్శలు గుప్పించారు.
Budget 2025: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు (ఫిబ్రవరి 1) వరుసగా ఎనిమిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. ఈ సందర్భంగా సాధారణ ప్రజలకు ఉపశమనం కలిగించే న్యూస్ చెప్పింది. అయితే, 2025-26 బడ్జెట్లో కొన్ని రకాల వస్తువలపై కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక కస్టమ్ డ్యూటీ నుంచి మినహాయింపులు ఇస్తున్నట్లు ప్రకటించింది.
PM Modi Big Gifts For Bihar: ప్రస్తుత బడ్జెట్లో ఎన్డీయే మిత్రపక్ష రాష్ట్రమైన బీహార్‌కు నరేంద్ర మోడీ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. రాష్ట్రంలో మఖానా బోర్డు ఏర్పాటుతో పాటు నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులను సైతం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది.
Railway Stocks: కేంద్రం పార్లమెంటులో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా రైల్వే స్టాక్స్ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. రైల్వేకు సంబంధించిన అన్ని కంపెనీలు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి.
Budget 2025: కేంద్రం ప్రవేశ పెట్టే బడ్జెట్‌పై హైదరాబాద్ నగరం భారీగా ఆశలు పెట్టుకుంది. మౌలిక వసతులు, ఇతర రంగాలకు ప్రాధాన్యం ఉంటుందని, నిధుల కేటాయింపులు ఉంటాయని మహా నగర ప్రజలు వేచి చూస్తున్నారు.
Union Budget 2025: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ రోజు (ఫిబ్రవరి 1న) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టబోతున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు, వేతన జీవుల నుంచి పారిశ్రామిక నేతల వరకూ అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.