Nitin Gadkari: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్థాయిలో ఉండటంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హస్తినలో మూడు రోజులుంటే చాలు వ్యాధి రావడం ఖాయమన్నారు. కాలుష్యం విషయంలో ఢిల్లీ, ముంబై రెడ్జోన్లో ఉన్నాయని పేర్కొన్నారు.
Student Kills Classmate: తమిళనాడులో పెన్సిల్ గొడవ పెను సంచలనంగా మారింది. పెన్సిల్ కోసం 8వ తరగతి చదువుతున్న స్నేహితుల మధ్య గొడవ జరిగింది. పెన్సిల్ వివాదంతో తోటి విద్యార్థిని మరో స్నేహితుడు కొడవలితో నరికి చంపేశాడు.
జగన్ కూడా అరెస్ట్ అయ్యే జైలుకు వెళ్లాడు కానీ కాకాణి మాత్రం దొరకడం లేదన్నారు. పోలీసులు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు.. అతడు విదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు కూడా ఇచ్చారు.. దోపిడీలు దొంగతనాలు తప్పుడు కేసులు పెట్టించడంలో కాకాణి నెంబర్ వన్ అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు.
YS Jagan: శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి సమీపంలో మాజీ ముఖ్యమంత్రి, వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రయాణించిన హెలికాప్టర్ విండో షీల్డ్ కు ఎయిర్ క్రాక్ ఘటనప్తె పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
TTD: వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఎస్వీ గోశాలలో గోవులు మృతి చెందాయని అసత్య ప్రచారాలపై భూమనపై ధర్మకర్తల మండలి ఫిర్యాదు చేసింది.
ED Summons Robert Vadra: వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు బిగ్ షాక్ తగిలింది. హర్యానా రాష్ట్రంలోని శిఖోపూర్ భూ ఒప్పందంలో తన సంస్థ స్కైలైట్ హాస్పిటాలిటీకి సంబంధించిన ఆర్థిక అవకతవకలను కేంద్ర దర్యాప్తు సంస్థ పరిశీలిస్తున్నంది.
Polavaram Project: రేపటి నుంచి పోలవరంలో కేంద్ర నిపుణుల బృందం పర్యటించనుంది. గ్యాప్-1, గ్యాప్-2 ప్రాంతాల్లో నిర్మిస్తున్న డయాఫ్రమ్ వాల్ పనుల నాణ్యత ఈ టీమ్ పరిశీలించనుంది. అల్లూరి జిల్లా దండంగి గ్రామం వద్ద స్పిల్వే సమీపంలో ఉంచిన మట్టి నిల్వల నుంచి శాంపిల్స్ సైతం సేకరించనున్నారు.