Students Protest: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని ఐనవోలు విట్ యూనివర్సిటీలో విద్యార్థినులు హాస్టల్ భోజనం బాగాలేదని రోడ్డెక్కారు. హాస్టల్లో అందిస్తున్న టిఫిన్, భోజనం నాణ్యత లేకపోవడంతో స్టూడెంట్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Minister Anagani: మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎన్టీవీతో మాట్లాడుతూ.. స్త్రీ శక్తి పథకం కారణంగా ఇవాళ విడుదల చేయాల్సిన కొత్త పాస్బుక్ల ఆవిష్కరణ వాయిదా పడిందని చెప్పుకొచ్చారు. వారం లేదా 10 రోజుల లోపులో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ పాస్బుక్లను ఆవిష్కరిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.
Ambati Rambabu: సీఎం చంద్రబాబు ఏ కార్యక్రమం అయినా మాపై బురద చల్లే కార్యక్రమాలు చేస్తున్నారు అని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. పులివెందులకు స్వాతంత్ర్యం వచ్చిందట.. ఇంత వరకు అంత దుర్మార్గమైన ఎన్నికలు ఎక్కడా జరిగి ఉండదు.
CM Chandrababu: స్త్రీ శక్తి పథకం యొక్క మొదటి లబ్ధిదారులుగా ఉమ, కృష్ణవేణి లను గౌరవించామని సీఎం చంద్రబాబు తెలిపారు. రూ. 2.02 కోట్ల మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించడం కోసమే ఈ పథకం తెచ్చాం.. ఆడ బిడ్డలకు మహర్దశ వచ్చే వరకూ అండగా ఉంటాం..
Deputy CM Pawan: విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ లో స్త్రీశక్తి పథకం ప్రారంభించిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. బలమైన అకుంఠిత దీక్ష ఉన్న వ్యక్తి సీఎం చంద్రబాబు.. మన రాష్ట్ర ఆడపడుచులకు ప్రత్యేక ధన్యవాదాలు.
Nara Lokesh: విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ లో స్త్రీశక్తి పథకం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఆవకాయ పెట్టాలన్నా అంతరిక్షానికి వెళ్ళాలన్నా మహిళలే.. స్వర్గీయ ఎన్టీఆర్ మహిళలకు అవకాశం కల్పించారు.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇచ్చారని గుర్తు చేశారు.
AP Free Bus Scheme: అమరావతిలోని ఉండవల్లి సెంటర్ నుంచి విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వరకు సీఎం చంద్రబాబు మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులో మహిళలతో కలిసి ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు.
Contractors Protest: నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి నుంచి ఓర్వకల్లు స్టీల్ ప్లాంట్ నీటి పైప్ లైన్ పనులను కాంట్రాక్టర్లు అడ్డుకున్నారు. నెల్లూరుకు చెందిన కేఎల్ ఎస్సార్ కంపెనీ వారు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని స్థానిక కాంట్రాక్టర్ల ఆవేదన వ్యక్తం చేశారు.