టాలీవుడ్లో ప్రస్తుతం వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రాబోయే చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే, ఈ సినిమా మొదలవడానికి మెగాస్టార్ చిరంజీవి చిత్రం కారణంగా బ్రేకులు పడ్డాయి. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న చిరంజీవి సినిమా ‘మన శంకర వరప్రసాద్‌గారు’లో వెంకటేష్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పాత్ర షూటింగ్ పూర్తి కాకపోవడంతో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ వాయిదా పడింది. వాస్తవానికి, వెంకటేష్ తన పాత్రను కేవలం పది రోజుల్లో ముగించి త్రివిక్రమ్ […]
టాలీవుడ్‌కు చెందిన రామానాయుడు స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థలు నిర్దేశించిన టాక్స్ మొత్తాన్ని కాకుండా, చాలా తక్కువ మొత్తంలో టాక్స్ కడుతున్నారంటూ జీహెచ్ఎంసీ (GHMC) తాజాగా నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, రామానాయుడు స్టూడియోస్ ను నిర్వహిస్తున్న సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ అధికారికంగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా తాము క్రమం తప్పకుండా రామానాయుడు స్టూడియో తరఫున ట్రేడ్ లైసెన్స్, జీహెచ్ఎంసీ జారీ చేసిన నోటీసులకు అనుగుణంగానే కడుతున్నామని […]
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వారణాసి అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నిజానికి, సినిమా ప్రారంభించినప్పటి నుంచే సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే టైటిల్ కానీ, ఏ ఇతర వివరాలు గానీ ముందు వెల్లడించలేదు. ఈ మధ్యకాలంలో రామోజీ ఫిలిం సిటీలో ఒక పెద్ద ఈవెంట్ నిర్వహించిన రాజమౌళి, ఆ ఈవెంట్లోనే ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేయడంతో పాటు, మహేష్ బాబుకు సంబంధించిన ఒక లుక్ కూడా రిలీజ్ చేశారు. […]
ఈ వారం దాదాపుగా 10 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో నాలుగు సినిమాలు మాత్రం కాస్త నోటెడ్గా ఉన్నాయి. వాటిలో ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది పాంచ్ మినార్. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ సినిమా అతని గత సినిమాలతో పోలిస్తే మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. అయితే ఎందుకు ఈ సినిమా మీద ప్రేక్షకులకు ఆసక్తి కనబడటం లేదు? ఆ తర్వాత ప్రియదర్శి హీరోగా నటించిన ప్రేమంటే సినిమాతో పాటు అల్లరి నరేష్ హీరోగా […]
ప్రముఖ పైరసీ వెబ్సైట్ ‘ఐబొమ్మ’ (iBOMMA) నిర్వాహకుడు రవి కేసులో తాజాగా సీఐడీ (CID) రంగంలోకి దిగింది. పైరసీ సినిమాలు అందిస్తూనే, చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్లు రవిపై ఆరోపణలు ఉన్నాయి. ఈరోజు పోలీసులు రవిని మూడో రోజు కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. మొదటి రెండు రోజులు విచారణలో రవి సరిగా సహకరించలేదని సమాచారం. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసింది డబ్బుల కోసమే అని రవి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. రవికి సంబంధించిన ఖాతాల వివరాలు అందించాలని […]
తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నవంబర్ 7న వచ్చిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’. సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా 7PM ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరించారు. తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్‌తో ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మౌత్ టాక్‌తో అద్భుతమైన స్పందనతో పాటు మంచి మసూళ్లను రాబట్టుకుంది. ‘ది […]
బెట్టింగ్ మరియు గేమింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో తెలంగాణ సీఐడీ (CID) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, నటి అమృత చౌదరి సీఐడీ అధికారుల ఎదుట హాజరై విచారణ ఎదుర్కొన్నారు. బెట్టింగ్ యాప్స్ కేసులో దర్యాప్తులో భాగంగా ఈ ముగ్గురు ప్రముఖులు సీఐడీ సిట్ (SIT) ఎదుట హాజరయ్యారు. సీఐడీ అధికారులు ముగ్గురిని గంటకుపైగా ప్రశ్నించారు. ఏయే బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారు, అందుకు ఎంత మొత్తంలో […]
బెట్టింగ్ మరియు గేమింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి, బిగ్ బాస్ ఫేమ్ మరియు ఫుడ్ బ్లాగర్ టేస్టీ తేజ సీఐడీ విచారణను ఎదుర్కొన్నారు. బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు నమోదు అయిన తర్వాత హర్ష సాయి విదేశాలకు పారిపోయినట్లు సమాచారం. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులోనూ విచారణకు హాజరు కాకుండా డుమ్మా కొట్టిన హర్ష […]
ఇథియోపియా నుండి వచ్చిన 65 ఏళ్ల పురుషుడికి పేస్ హాస్పిటల్స్ విజయవంతంగా చికిత్స అందించింది. ఈ పేషెంట్ కి గతంలో ఇతర ఆసుపత్రిలో నిర్వహించిన TURP (ట్రాన్స్యురెత్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రోస్టేట్ ) ప్రక్రియ తర్వాత సంక్లిష్ట యురేత్రల్ స్ట్రిక్చర్ మరియు బ్లాడర్ నెక్ కాన్ట్రాక్చర్ ఏర్పడింది. పేషెంట్ ని పేస్ హాస్పిటల్స్, హైటెక్ సిటీలో సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్టు & రీనల్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ విశ్వంభర్ నాథ్ పర్యవేక్షణలో పరిశీలించి చికిత్స అందించారు. పేషెంట్ […]
తమిళనాడుకు చెందిన సూర్యకు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ మధ్యనే తెలుగు నిర్మాతతో, తెలుగు దర్శకుడితో తెలుగు సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు కూడా. అలాగే, మరిన్ని తెలుగు సినిమాలు కూడా చేస్తానని ఆయన ప్రకటించారు. అయితే, ఈ మధ్యకాలంలో ఆయన ఎన్నో కథలు విని చివరికి వెంకీ అట్లూరితో సినిమా ఫైనల్ చేశారు. ప్రస్తుతానికి సినిమా షూటింగ్లో ఉంది, వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. Also Read :SS […]