రాజన్న సిరిసిల్లలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని సీపీఐ పార్టీ కార్మిక భవనంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతుందని.. జమిలి ఎన్నికలు అసాధ్యం అని అన్నారు.
హుజురాబాద్‌లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నియోజక వర్గంలో దళిత బంధు రెండో విడత రాని వాళ్లు తనకు దరఖాస్తు ఇవ్వాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. దరఖాస్తు ఇవ్వడానికి వచ్చిన వారితో కలిసి స్థానిక అంబేద్కర్ చౌరస్తాకు బయలుదేరిన కౌశిక్ రెడ్డిని పోలీసులు అడుకున్నారు.
రైతు గర్జనలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొద్దు నిద్ర పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవాలని విమర్శలు గుప్పించారు. రైతు బంధు, రుణ మాఫీ, ధాన్యం కొనుగోళ్ళ కోసం రైతు దీక్ష చేస్తున్నాం.. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపేందుకే రైతు దీక్ష చేస్తున్నామన్నారు.
యాదాద్రి జిల్లాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. పోచంపల్లి మండలం గౌస్ కొండ, రేవనపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడి.. కొనుగోలు ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు కిషన్ రెడ్డికి తమ సమస్యలు చెప్పుకున్నారు. కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతుంది.. హమాలీల కొరత ఉంది.. ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం కల్పించడం లేదు.. బస్తాలు, తర్పలిన్, సూతిల్ కూడా లేవని కిషన్ రెడ్డికి రైతులు చెప్పారు.
ఈ నెల 14 నుండి డిసెంబర్ 9వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలు నిర్వహించనుంది. గత పది నెలల్లో ఊహకందని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో సర్కార్ ముందుకు దూసుకెళ్తుంది. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి అవుతున్నందున.. ఈ నెల 14 వ తేదీ నుండి డిసెంబర్ 9వ తేదీ వరకు 26 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలు నిర్వహించనున్నారు.
Ponnam Prabhakar: బీజేపీ నేత లక్ష్మణ్ అంటే కొంత గౌరవం ఉండే కానీ తాను వచ్చిన వర్గాలకు మద్దతుగా ఉండకపోయినా కించపరిచేలా మాట్లాడటం ఏంటి..? అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
CM Revanth Reddy: ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ముంబైలో చేరుకున్న సీఎం మీడియా సమావేశంలో మాట్లాడుతూ..
Nagarjunasagar: తెలుగు రాష్ట్రాల్లో మరో వివాదం మొదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇరిగేషన్ అధికారుల మధ్య మళ్లీ ఘర్షణ చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ డ్యాం వద్ద మీటర్ రీడింగ్ కోసం వెళ్లిన తెలంగాణ అధికారుల బృందాన్ని ఏపీ ఇరిగేషన్ అధికారులు అడ్డుకున్నారు.
Green Tea: గ్రీన్ టీ అంటేనే చాలా మంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు..ఇతర పోషకాలతో ఆరోగ్యకరమైన పానీయంగా భావిస్తారు. గ్రీన్ టీ తగిన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
Samagra Kutumba Survey: రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వేలో నేడు అసలు ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి దశలో (బుధవారం) నుంచి మూడు రోజులుగా కుటుంబాలను గుర్తించి సిబ్బంది ఇళ్లకు ఎన్యూమరేటర్లు స్టిక్కర్లు వేశారు.