ఈ మధ్యే అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లలో మార్పులు, చేర్పులతో పాటు.. జిల్లా అధ్యక్షుల్లోనూ ఇదే జరిగింది.. అయితే, పార్టీలో నాయకత్వ మార్పుపై విశాఖ ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. విశాఖ వైసీపీ కార్యాలయంలో రాజ్యాంగ అమలు దినోత్సవం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి మంత్రి అమర్నాథ్, వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే లు, ఎంపీలు హాజరయ్యారు.. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యున్నత విలువలతో రూప కల్పన జరిగిందన్నారు.. ఇప్పుడు రాజ్యాంగ స్పూర్తికి తగ్గట్టుగా రాష్ట్రంలో పాలన జరుగుతోందని స్పష్టం చేశారు. 2014-19 మధ్య చంద్రబాబు పాలనలో రాజ్యాంగానికి తూట్లు పొడిచారని విమర్శించారు.. ఏపీలో పేదల సంక్షేమ పథకాలు అమలు రాజ్యాంగ స్పూర్తిగా ఆనువుగా జరుగుతున్నాయని వెల్లడించారు వైవీ సుబ్బారెడ్డి.
Read Also: Man loses tongue: జ్యోతిష్యుడి సలహా విని పాము కాటుతో నాలుకను కోల్పోయాడు.. ఎలాగంటే?
ఇక, పార్టీలో నాయకత్వ మార్పుపై ఆయన స్పందిస్తూ.. పదవులు మార్చినంత మాత్రాన ఆ లీడర్లను తక్కువ చేసినట్టు కాదన్నారు వైవీ సుబ్బారెడ్డి.. నాయకులను అవసరం బట్టి మరోచోట వినియోగించుకోవాలని పార్టీ ఆలోచనగా తెలిపిన ఆయన.. పార్టీలో చేరికలు నిరంతర ప్రక్రియగా అభివర్ణించారు.. ఇక, పార్టీలో చేరికలపై స్పందించిన ఆయన.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా చేరవచ్చు అన్నారు.. ఆ చేరిక పార్టీకి ఏ మేరకు ప్రయోజనం అన్నది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. పాదయాత్రలు ఎవరైనా చేయవచ్చు.. ప్రజలకు ఇచ్చిన హామీలను 95 శాతం నెరవేర్చినది మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని స్పష్టం చేశారు వైవీ సుబ్బారెడ్డి.. మరోవైపు, దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చిన మహనీయులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కొనియాడారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగానే ఏపీలో పాలన జరుగుతుందని తెలిపారు.