వైసీపీలో నూతన నియామకాలు చేపట్టింది. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే విశ్వరూప్, కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షులుగా చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే శ్రీకాంత్ ను నియమించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ ఆసిఫ్, క్రమశిక్షణా కమిటీ సభ్యులుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ప్రకటించింది. అలాగే.. వైసీపీలో పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ పూర్తి స్థాయి పునర్వ్యవస్థీకరణ జరిగింది. 33 మంది నాయకులను పీఏసీ మెంబర్లుగా నియమించారు.
ఈ మధ్యే అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లలో మార్పులు, చేర్పులతో పాటు.. జిల్లా అధ్యక్షుల్లోనూ ఇదే జరిగింది.. అయితే, పార్టీలో నాయకత్వ మార్పుపై విశాఖ ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. విశాఖ వైసీపీ కార్యాలయంలో రాజ్యాంగ అమలు దినోత్సవం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి మంత్రి అమర్నాథ్, వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే లు, ఎంపీలు హాజరయ్యారు.. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..…
వరస సమీక్షలు.. హెచ్చరికలు తర్వాత మాట వినని పార్టీ నేతలకు షాక్ ఇచ్చారు వైసీపీ అధినేత, సీఎం జగన్. వైసీపీలో కీలక స్థానాల్లో ఉన్న ముఖ్య నేతలనే పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇచ్చారు. రెండు నెలల కిందట గడప గడపకు మన ప్రభుత్వం సమీక్ష సందర్భంగా రీజినల్ కోఆర్డినేటర్ల పనితీరును అసెస్ చేసిన జగన్.. కొంతమంది పనితీరుపై ఓపెన్‌గానే అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, మంత్రి…
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.. రీజనల్ కో ఆర్డినేటర్ నియామకంలో మార్పులు చేసింది.. కొంత మందిని తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు రీజినల్ కోఆర్డినేటర్‌గా మంత్రి బొత్స సత్యనారాయణను నియమించిన పార్టీ.. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు టీటీడీ చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డిని నియమించారు.. ఇక, తూర్పు గోదావరి, డాక్టర్…