జిల్లాల్లో మీరే సర్వం.. మీరే పార్టీ.. పార్టీయే మీరు.. అంతే కాదు జిల్లాల్లో అన్నిస్థానాల్లో గెలిపించాల్సిన బాధ్యత కూడా మీదే అంటూ జిల్లా అధ్యక్షులపై కీలక బాధ్యతలు మోసారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. వైసీపీ జిల్లా అధ్యక్షులతో పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమైన జగన్.. పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తూ.. కీలక సూచనలు చేశారు..
వైసీపీ జిల్లా అధ్యక్షులతో సమావేశమైన పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన నాయకత్వ ప్రతిభ బయటపడుతుంది.. భారీ లక్ష్యం ఉన్నప్పుడే బ్యాట్స్‌మన్ ప్రతిభ బయటపడుతుంది.. అప్పుడే ఆ బ్యాట్స్‌మెన్ ప్రజలకు ఇష్టుడు అవుతాడు.. ఇదికూడా అంతే.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చేసే పనులవల్ల మనం ఎలివేట్ అవుతాం.
ఈ మధ్యే అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లలో మార్పులు, చేర్పులతో పాటు.. జిల్లా అధ్యక్షుల్లోనూ ఇదే జరిగింది.. అయితే, పార్టీలో నాయకత్వ మార్పుపై విశాఖ ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. విశాఖ వైసీపీ కార్యాలయంలో రాజ్యాంగ అమలు దినోత్సవం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి మంత్రి అమర్నాథ్, వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే లు, ఎంపీలు హాజరయ్యారు.. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..…
వరస సమీక్షలు.. హెచ్చరికలు తర్వాత మాట వినని పార్టీ నేతలకు షాక్ ఇచ్చారు వైసీపీ అధినేత, సీఎం జగన్. వైసీపీలో కీలక స్థానాల్లో ఉన్న ముఖ్య నేతలనే పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇచ్చారు. రెండు నెలల కిందట గడప గడపకు మన ప్రభుత్వం సమీక్ష సందర్భంగా రీజినల్ కోఆర్డినేటర్ల పనితీరును అసెస్ చేసిన జగన్.. కొంతమంది పనితీరుపై ఓపెన్‌గానే అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, మంత్రి…