అనంతపురం : ఏపీ మంత్రి శంకరనారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. టిడిపి ప్రభుత్వ హాయంలో రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు సంబంధించి రూ. 2,000 వేల కోట్ల నిధులను పసుపు – కుంకుమకు మళ్లించారని ఆరోపణలు చేశారు. అచ్చెన్మాయుడుకు ఈ విషయం తెలియదా…! 2017 నుంచి 2019 వరకు టిడిపి హాయంలో రోడ్ల మరమ్మత్తులు చేపట్టలేదని మండిపడ్డారు.
read also : ఏపీలో ఆ వైసీపీ ఎమ్మెల్సీకి కొత్త కష్టాలు !
పాత మరమ్మత్తు బకాయిలను వైసీపీ ప్రభుత్వం చెల్లించిందని… అచ్చెన్నాయుడు అసత్య ప్రచారం చేస్తే నాలుక కోస్తామని హెచ్చరించారు. నోటికి వచ్చినట్లు కాకుండా… ఏదో ఒక్కటి మాట్లాడాలని అచ్చెన్నాయుడికి చురకలు అంటించారు. అనవసరంగా టీడీపీ నేతలు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రహదారుల మరమ్మత్తుల పనులు మొదలు పెట్టామని… కానీ వర్షాల వల్ల ఆగిందని పేర్కొన్నారు.