YSRCP: ఇటీవల ఏపీలోని అధికార పార్టీ వైసీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు వైసీపీ ట్విట్టర్ ఖాతాలో క్రిప్టో కరెన్సీకి చెందిన వార్తలను పోస్ట్ చేయడంతో వైసీపీ ట్విట్టర్ నిర్వాహకులు అవాక్కయ్యారు. అంతేకాకుండా ప్రొఫైల్ ఫోటోగా కోతి బొమ్మను పెట్టారు. శుక్రవారం అర్ధరాత్రి తమ ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్‌కు గురైనట్లు వైసీపీ సాంకేతిక బృందం గుర్తించింది. దీంతో వెంటనే ట్విట్టర్ టెక్నికల్ సపోర్ట్ టీమ్‌కు సమాచారం అందించింది. తీవ్రంగా శ్రమించిన ట్విట్టర్ టీమ్ ఆదివారం రాత్రి వైసీపీ ఖాతాను పునరుద్ధరించింది.
Read Also: Unstoppable 2: బ్రేకింగ్.. బాలయ్య తో ప్రభాస్.. ఫొటోస్ లీక్
ఈ నేపథ్యంలో తమ ఖాతా రిస్టోర్ కావడంపై వైసీపీ స్పందించింది. హ్యాకింగ్ అనంతరం తొలి ట్వీట్ చేసింది. ‘గతంలో ఎన్నడూ లేని విధంగా మా ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. గత 36 గంటలుగా మా ట్విట్టర్ ఖాతా మా అధీనంలో లేదు. ఇప్పుడు మా ట్విట్టర్ ఖాతా పునరుద్ధరించారు. ఈ సహాయానికి ట్విట్టర్ మద్దతు విభాగానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం’ అని వైసీపీ ట్వీట్ చేసింది. కాగా ఇటీవల టీడీపీ ట్విట్టర్ అకౌంట్ కూడా హ్యాక్‌కు గురైన విషయం తెలిసిందే.
Due to some unforeseen circumstances our twitter account was compromised for last 36 hrs
Our Twitter account is restored now.
Thanks @TwitterSupport team for all the help.
— YSR Congress Party (@YSRCParty) December 11, 2022