బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి.. కర్నూలు జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన… ఆయన సోము వీర్రాజు కాదు.. పిచ్చి వీర్రాజులా వ్యవహరిస్తున్నారు అంటూ మండిపడ్డారు.. శ్రీశైలంలో శివలింగం పెకిలించారని సోము వీర్రాజు విమర్శిస్తున్నారు, ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించండి అంటూ సవాల్ చేశారు… శ్రీశైలం అభివృద్ధి ఎవరి టైంలో జరిగిందో చర్చకు సిద్ధం..? సోము వీర్రాజు సిద్ధమా..? అంటూ ఛాలెంజ్ విసిరారు శిల్పా చక్రపాణి…