Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ysrcp Leaders Attack On Kondapi Mla House

Kondepi Tension: ఎమ్మెల్యే ఇంటిముట్టడి యత్నం.. వివాదాస్పదం

Published Date :April 9, 2022 , 7:58 pm
By NTV WebDesk
Kondepi Tension: ఎమ్మెల్యే ఇంటిముట్టడి యత్నం.. వివాదాస్పదం
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఏపీ రాజకీయాలు కాకరేపుతూనే వున్నాయి. ప్రకాశం జిల్లా కొండపి టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి ఇంటి ముట్టడికి వైసీపీ నేత అశోక్ బాబు ప్రయత్నించడం ఉద్రిక్తతకి దారి తీసింది. ఎమ్మెల్యే స్వామి ఇంటికి కార్యకర్తలతో వెళ్తున్న వైసీపీ నాయకుడు అశోక్ బాబుని పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసులను నెట్టుకుంటూ ముందుకు వెళ్లేందుకు అశోక్ బాబు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో 16వ నెంబరు జాతీయ రహదారిపై కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ప్రకాశం జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి 1734 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డాడని నిన్న కొండపి టీడీపీ ఎమ్మెల్యే స్వామి ఆరోపించారు. అయితే ఎమ్మెల్యే స్వామి ఆరోపణలపై మంత్రి బాలినేని స్పందించలేదు. అయితే కొండపి వైసీపీ నాయకుడు అశోక్ బాబు ఎమ్మెల్యే స్వామి ఆరోపణలపై ఆయన ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించడం వివాదాస్పదం అయింది.

Also Read

  • Hundi Income: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ హుండీ లెక్కింపు.. కళ్లు చెదిరే ఆదాయం..
  • Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
  • AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు
  • Minister Gottipati Ravikumar: విద్యుత్ కోతలకు నో.. నిరంతర సరఫరా ఉండాల్సిందే.. మంత్రి గొట్టిపాటి ఆదేశాలు

టంగుటూరు నుండి కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే స్వామి ఇంటి ముట్టడికి బయలు దేరాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మార్గ మధ్యంలో అశోక్ బాబుని అడ్డుకున్నారు. అయితే పోలీసులను నెట్టుకుంటూ ముందుకు వెళ్లేందుకు అశోక్ బాబు ప్రయత్నించడంతో వైసీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఇరువురి మధ్య తోపులాటతో 16వ నెంబరు జాతీయ రహదారిపై కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే తోపులాటలో అశోక్ బాబు స్పృహతప్పి పడిపోవడంతో వైసీపీ కార్యకర్తలు రోడ్డు పక్కన కూర్చోబెట్టి సపర్యలు చేశారు.

వైసీపీ నేత అశోక్ బాబు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే స్వామి ఇంటికి వస్తున్నాడని తెలుసుకుని ఆయన ఇంటి వద్దకు టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. అశోక్ బాబు ఎమ్మెల్యే స్వామి ఇంటికి వస్తే చీర, గాజులు పెడతామంటూ నినాదాలు చేశారు. తమ పార్టీ మంత్రిపై ఆరోపణలు చేసినందుకే ఎమ్మెల్యే స్వామి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించానని అశోక్ బాబు చెబుతున్నారు. ఇరుపార్టీల కార్యకర్తల మోహరింపుతో టంగుటూరు, నాయుడుపాలెం గ్రామాల్లో కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే స్వామి ఇంటి ముట్టడికి యత్నించిన వైసీపీ నాయకుడు అశోక్ బాబుని పోలీసులు అరెస్టు చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ ఘటనను టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • ap politics
  • balineni
  • chandrababu
  • cm jagan

తాజావార్తలు

  • Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్‌డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌కు చరమగీతం..?

  • Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!

  • NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?

  • MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్‌కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..

  • Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions