Big Breaking: ఏపీ అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయిన నాటి నుంచి సభలో టీడీపీ సభ్యుల ఆందోళన.. వారిని సస్పెండ్ చేయడం నిత్యకృత్యంగా సాగుతుండగా.. ఇవాళ ఘర్షణ వరకు దారి తీసింది.. సభలో టీడీపీ ఎమ్మెల్యే డోలా, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు కొట్టుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. జీవో నంబర్ 1ను రద్దు చేయాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ.. సభ ప్రారంభమైన వెంటనే వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టింది.. జీవో నంబర్ 1ను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు టీడీపీ సభ్యులు.. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు.. సభలో బైఠాయించిన ఆందోళన వ్యక్తం చేశారు.. స్పీకర్ దగ్గర ప్లకార్డులను ప్రదర్శించారు.. అయితే, ఇక్కడ ఘర్షణకు దారి తీసింది..
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
స్పీకర్ ముఖంపై ప్లకార్డును పెట్టారు టీడీపీ ఎమ్మెల్యే డోలా.. అయితే, ఆ ప్లకార్డును పక్కకు తోసేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం.. దీనిపై తీవ్రంగా స్పందించిన డోలా.. స్పీకర్‌తో దురుసుగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది.. ఇక, స్పీకర్ తో టీడీపీ ఎమ్మెల్యేలు దురుసుగా వ్యవహరించటంతో రక్షణగా పోడియం దగ్గరకు వెళ్లారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు.. సుధాకర్‌బాబు సహా మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలు పోడయం దగ్గరకు వెళ్లగా.. అక్కడే.. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.. ఎమ్మెల్యేలు డోలా, సుధాకర్ బాబు కొట్టుకున్నట్టు తెలుస్తోంది. దీంతో.. సభలో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది.. టీడీపీ సభ్యులపైకి దూసుకెళ్లారు వైసీపీ ఎమ్మెల్యేలు సంజీవయ్య, ఇతరులు.. వెంటనే తమ సభ్యులు ముందుకు వెళ్లకుండా మంత్రి అంబటి రాంబాబు, శ్రీకాంత్ రెడ్డి అడ్డుకున్నారు.. ఇక, వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
తాజావార్తలు
-
Vastu Tips: ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశం వాస్తు ప్రకారం ఎలా ఉండాలి? చాలామందికి తెలియని విషయాలు ఇవే!
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!