ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయిన నాటి నుంచి సభలో టీడీపీ సభ్యుల ఆందోళన.. వారిని సస్పెండ్ చేయడం నిత్యకృత్యంగా సాగుతుండగా.. ఇవాళ ఘర్షణ వరకు దారి తీసింది.. సభలో టీడీపీ ఎమ్మెల్యే డోలా, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు కొట్టుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. జీవో నంబర్ 1ను రద్దు చేయాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ.. సభ ప్రారంభమైన వెంటనే వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టింది..…