OTR: రేపల్లె మున్సిపల్ ఎన్నిక మంత్రికి అగ్ని పరీక్షేనా..?
- మంత్రి అనగాని కంచుకోట రేపల్లె నియోజకవర్గం
- హ్యాట్రిక్ విజయాలు, 2024లో కేబినెట్ బెర్త్
- లోకల్‌గా అనగానికి రైట్ హ్యాండ్ గూడపాటి శ్రీనివాసరావు
- అనగాని గౌడ, గూడపాటి కాపు ఈక్వేషన్స్‌తో రాజకీయం
- రేపల్లె టౌన్లో గూడపాటి శ్రీనివాసరావుకు గట్టి పట్టు
- ఇటీవల టీడీపీని వదిలి వైసీపీలో చేరిన గూడపాటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ మంత్రికి లోకల్ సెగ గట్టిగా తగులుతోందా? గెలుపు నల్లేరు మీద నడక అని ఇన్నాళ్ళు భావించిన చోట ఆయన ప్రయాణంలో కుదుపులు పెరిగాయా? సొంత నియోజకవర్గ కేంద్రంలో టీడీపీ అభ్యర్థిని గెలిపించడానికి నానా తంటాలు పడక తప్పదా? ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలు సాధించిన వ్యక్తికి మున్సిపాలిటీ ఎందుకు మింగుడుపడటం లేదు? మహా సాగరాన్ని ఈదిన గజ ఈతగాడికి పిల్ల కాలువ ఎందుకు గండంలా కనిపిస్తోంది?
బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా హ్యాట్రిక్ కొట్టారు మంత్రి అనగాని సత్యప్రసాద్. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హవా ఉన్నా… రేపల్లె ఓటర్లు మాత్రం అనగానికే పట్టం కట్టారు. వైసీపీ తరపున ఆయనతో పోటీ పడే అభ్యర్దులు మారినా ఫలితం మాత్రం మారలేదు. ఇక 2024లో వరుసగా మూడోసారి గెలిచాక ఆయనకు కేబినెట్ బెర్త్ దక్కింది. టీడీపీకి రేపల్లె కంచుకోటగా మారిపోయిన క్రమంలో… ఇక్కడి వైసీపీ శ్రేణుల్లో సహజంగానే నైరాశ్యం పెరిగిపోయింది. అయితే…ఆ పార్టీ అధినాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా కేడర్ని రీ ఛార్జ్ చేసే పనిలో భాగంగా రేపల్లె మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా… పాత ఇన్ఛార్జ్ డాక్టర్ గణేష్ స్థానంలో పీటా నాగమోహనకృష్ణను నియమించింది. పీటా దూకుడుతో నియోజకవర్గంలో ఫ్యాన్ స్పీడ్ కాస్త పెరిగిందన్న అభిప్రాయం ఉంది. మరోవైపు రేపల్లెలో అనగాని సత్యప్రసాద్‌కు మొదట్నుంచి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు స్థానిక నేత గూడపాటి శ్రీనివాసరావు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మంత్రికి రైట్ హ్యాండ్‌గా ఉన్నారాయన. నియోజకవర్గంలో టీడీపీ గెలుపు కోసం గూడపాటి గట్టిగానే పనిచేశారన్నది కేడర్ అభిప్రాయం. ఇద్దరికీ ఈక్వేషన్స్ కూడా బాగా కలిశాయని అంటారు. అనగాని గౌడ సామాజికవర్గం ఓటర్ల సంగతి చూసుకుంటే… గూడపాటి కాపుల ఓట్లు టీడీపీకి పడేలా జాగ్రత్తలు తీసుకునేవారు. ఇలా నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న గౌడ, కాపు సామాజికవర్గం ఓటర్లలో ఎక్కువ శాతం అనగానికి టర్న్ అయ్యేలా ప్లాన్ చేస్తుండడంతో వరుసగా గెలుపు సాధ్యమైందని అంటారు.
Also Read
ఇక రేపల్లె టౌన్లో అయితే… గూడపాటి శ్రీనివాసరావుకు గట్టి పట్టుంది. గత మూడు ఎన్నికల్లో ఇక్కడి పోల్ మేనేజ్మెంట్ మొత్తం ఆయన కనుసన్ననల్లోనే జరిగింది. 2014లో గూడపాటి శ్రీనివాసరావు మామ తాడివాక శ్రీనివాసరావు రేపల్లె మున్సిపల్ చైర్మన్ అయ్యారు. గతంలో ఆర్టీసీలో పనిచేసిన తాడివాక…. మున్సిపల్ చైర్మన్ అవడం వెనుక చక్రం తిప్పింది మొత్తం ఆయన అల్లుడేనన్నది రేపల్లెలో ఓపెన్ టాక్. మున్సిపాలిటీ పరిధిలో ఎవరెవరిని చేరదీస్తే ఎలా గెలవచ్చనే బ్లూప్రింట్ గూడపాటి దగ్గర ఎప్పుటూ సిద్ధంగానే ఉంటుందని అంటారు. అలాంటి నాయకుడు టీడీపీని వదిలి వైసీపీలో చేరడం మంత్రి అనగానికి షాకేనని అంటున్నారు. టీడీపీకి రాజీనామా చేసిన రోజే… ఆయన జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోవడం రేపల్లె రాజకీయవర్గాల్లో కలకలం రేపింది.
దీంతో… ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నిక మంత్రి సత్యప్రసాద్‌కు అగ్ని పరీక్షేనని అంటున్నారు. అసలు మంత్రికి రైట్ హ్యాండ్‌గా ఉన్న వ్యక్తి అధికార పార్టీని కాదని ప్రతిపక్షంలోకి ఎందుకు వెళ్ళారంటే… ఆధిపత్యపోరేనన్నది స్థానిక రాజకీయ వర్గాల మాట. మంత్రి సోదరుడికి, గూడపాటికి మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలు చివరికి ఆయన బయటికి వెళ్ళేలా చేశాయని అంటారు. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్దమవుతున్న తరుణంలో రేపల్లె మున్సిపాలిటీపై వైసీపీ కన్ను పడింది. ఇప్పటికే గూడపాటి చేరికతో పుంజుకున్నామని భావిస్తుండగా…కాస్త గట్టిగా ప్రయత్నిస్తే రేపల్లెలో పార్టీ జెండా ఎగరేయవచ్చని, మంత్రిని ఆయన సొంత ఊళ్ళేనే కొట్టవచ్చని భానవిస్తున్నారట ఫ్యాన్ పెద్దలు. అటు గూడపాటి శ్రీనివాసరావు సైతం రేపల్లెలో తానేంటో నిరూపించుకునేందుకు తహతహలాడుతున్నారట.
అందుకే తన అనుచరులతో కలిసి చాపకింద నీరులా పావులు కదుపుతున్నట్టు చెప్పుకుంటున్నారు. రేపల్లె మున్సిపాలిటీలోని ప్రతి వార్డ్‌పై పూర్తి స్థాయి అవగాహన ఉన్న శ్రీనివాసరావు గతంలో టీడీపీకి చేసినట్టే… ఇప్పుడు వైసీపీ అభ్యర్దుల గెలుపుకోసం పక్కాగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు మంత్రి అనగానికి, టీడీపీకి ఇబ్బందిగా మారిందంటున్నారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో… వ్యక్తిగతంగా ఆయనతో పాటు ఇటు పార్టీకి కూడా రేపల్లె ప్రతిష్టాత్మకమే. పార్టీ మారి పట్టు నిరూపించుకునేందుకు గూడపాటి, ఆయన వెళ్లిపోయినా మాకేం డ్యామేజ్ లేదని చెప్పేందుకు మంత్రి సోదరుడు శివప్రసాద్ గట్టిగా ప్రయత్నిస్తుండటంతో రేపల్లె రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఇక్కడ గతంలో 28 వార్డులుంటే పునర్విభజనతో 36కు పెరిగాయి. మున్సిపాలిటీ పరిధిలో అత్యధికంగా ఉన్న కమ్మ, కాపు, యాదవ, ముస్లిం, వైశ్య సామాజికవర్గాల ఓటర్లపై మంత్రి అనుచరులు ప్రధానంగా దృష్టి పెట్టారట. స్థానిక ఎన్నికల్లో తేడా వస్తే ఊరుకునేది లేదని, సీరియస్‌గా పని చెయ్యాలని పార్టీ క్యాడర్ని అనగాని హెచ్చరించినట్టు తెలిసింది. మరోవైపు వైసీపీ కూడా… అదే టోన్‌లో ఉండటంతో… స్టేట్‌లోనే హాట్ టౌన్‌గా మారుతోంది రేపల్లె
తాజావార్తలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!