CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
- గోదావరి–కావేరి అనుసంధానంతో దక్షిణాదికి జల ప్రయోజనాలు
- 2027 గోదావరి పుష్కరాలకు ప్రత్యేక నిధులు కోరిన సీఎం
- ఎల్‌నినోతో 53 శాతం లోటు వర్షపాతంపై మోదీకి వివరాలు
- విశాఖ మెట్రో, అమరావతి ఓఆర్ఆర్కు కేంద్ర సాయం కోరిన చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
25 ఏళ్ల పాలనా ప్రస్థానంపై ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. దేశ సేవలో అరుదైన ఘనత సాధించిన ప్రధాని మోదీ సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా స్ఫూర్తిదాయక నాయకత్వాన్ని చూపారని, క్రమశిక్షణ, నిబద్ధతతో దేశానికి సేవలు అందించారని అన్నారు. దూరదృష్టి… స్పష్టమైన లక్ష్యం…..ధృడమైన నిర్ణయాలు…సమర్థవంతమైన పాలనతో భారత్‌ను ప్రపంచ శక్తిగా మలిచారని కీర్తించారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో భారత దేశ గమనాన్ని మర్చారని సిఎం చంద్రబాబు అన్నారు. ముఖ్యంగా సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాలను భాగస్వాములుగా చేసి వికసిత్ భారత్ వైపు దేశాన్ని నడిపిస్తున్నారని అన్నారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ గౌరవాన్ని, విశ్వసనీయతను మరింత పెంచేలా తోడ్పడ్డారని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర ప్రజల తరుపున ఈ సందర్భంగా ప్రధానికి సీఎం శుభాకాంక్షలు తెలిపారు.
నదుల అనుసంధానంపై ప్రతిపాదనలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిపిన భేటీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక అంశాలను ప్రస్తావించారు. ఈ భేటీలో రాష్ట్రాభివృద్ధికి చెందిన వివిధ కీలక ప్రాజెక్టులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వ్యవసాయ, ఇరిగేషన్ వంటి అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. నీటిపారుదల రంగానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు తాజా నివేదికతో పాటు గోదావరి – కావేరి నదుల అనుసంధానం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు వివరించారు. గోదావరి–కావేరి నదుల అనుసంధానం జరిగితే దక్షిణాదిలోని ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సమృద్ధిగా నీరు అందుతుందని ముఖ్యమంత్రి వివరించారు. దేశవ్యాప్తంగా రహదారుల నెట్వర్క్, పవర్ గ్రిడ్ వంటివి ఎన్డీఏ ప్రభుత్వాల హయాంలోనే జరిగాయని… ఇప్పుడు నదుల అనుసంధాన ప్రాజెక్టును ముందుకు తీసుకువెళితే వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని సీఎం చంద్రబాబు వివరించారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు రాష్ట్రంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. పుష్కరాల కోసం చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని ప్రధానిని సిఎం కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా…దేశ విదేశాల నుంచి సైతం గోదావరి పుష్కరాలకు భక్తులు తరలి వస్తారని సీఎం వివరించారు.
Also Read
రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో 53 శాతం లోటు వర్షపాతం నమోదైందని…ఇది వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపించిందని ప్రధానికి సిఎం వివరించారు. కరువు నష్టాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల కేంద్ర సహకారంతో మదనపల్లె కేంద్రంగా ప్రారంభించిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ లక్ష్యాలను కూడా ప్రధానికి తెలిపారు. అలాగే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తరహాలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశామని వెల్లడించారు.
మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై వినతి
రాష్ట్రంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్ర సహకారాన్ని సీఎం కోరారు. రాజధాని అమరావతిలో చేపడుతున్న ఔటర్ రింగ్ రోడ్డు వంటి అంశాలపై సీఎం చంద్రబాబు ప్రధాని మోదీతో చర్చించారు. విశాఖ మెట్రోను మంజూరు చేయాలని సిఎం కోరారు. అలాగే బీచ్ రోడ్డు నిర్మాణం గురించి వివరించారు. 2047 నాటికి రాష్ట్రంలో అందరికీ అభివృద్ధి ఫలాలు సమానంగా అందేలా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర – 2047 విజన్ గురించి ప్రధానికి సీఎం తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!