వైఎస్‌ఆర్ లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డుల ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్సార్ లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్, వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డులను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వ్యక్తులకు ఈ అవార్డులకు ఎంపిక చేశారు.. రాష్ట్ర ప్రభుత్వం తరపున అవార్డుల హైపవర్ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు, రాష్ట్ర కమ్యూనికేషన్ల సలహాదారు జీవీడీ కృష్ణమోహన్ ఈ అవార్డుల జాబితాలను ప్రకటించారు. మొత్తంగా వివిధ రంగాలకు చెందిన 63 మందికి అవార్డులు ఇవ్వనున్నారు.. వివిధ రంగాల్లోని ఎనిమిది సంస్థలకు లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డులు దక్కగా.. రైతు విభాగంలో కడియం నర్సరీ వ్యవస్థాపకుడు స్వర్గీయ పల్లా వెంకన్నకు లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డుకు ఎంపిక చేశారు.. కళాకారుల విభాగంలో ఐదుగురికి లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డులు ఇవ్వగా.. రచయితల విభాగంలో ఏడుగురికి, పాత్రికేయుల విభాగంలో ఎనిమిది మందికి లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డులు వచ్చాయి..
మొత్తంగా 11 మంది రైతులు, 21 మంది కళాకారులకు, ఏడుగురు రచయితలకు, 8 మంది చొప్పున పాత్రికేయులు, కోవిడ్ వారియర్లకు అవార్డులకు ఎంపిక చేశారు.. 31 మందిని లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డులకు, 32 మందిని ఎచీవ్‌మెంట్ అవార్డులకు ఎంపిక చేసింది సర్కార్.. వచ్చే 14వ తేదీన అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.. వైఎస్సార్ లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డు కింద రూ.10 లక్షల నగదు, వైఎస్సార్ కాంస్య ప్రతిమ, మెడల్, శాలువ బహుకరించనుండగా.. వైఎస్సార్ ఎచీవ్‌మెంట్ అవార్డు కింద రూ. 5 లక్షల నగదు, వైఎస్సార్ కాంస్య ప్రతిమ, మెడల్, శాలువ బహుకరిస్తారు. వైఎస్సార్ లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డులను ఇవ్వాలని 2019లోనే సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారని తెలిపారు కమ్యూనికేషన్ సలహాదారు జీవీడీ కృష్ణమోహన్.. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే ప్రయత్నం చేశామని.. పూర్తి పారదర్శకతతో అవార్డులను ఎంపిక చేశామని.. సామాన్యుల్లో ఉన్న అసామాన్యులను గుర్తించే ప్రయత్నం చేశామని.. సంస్ధలకు.. వ్యక్తులకూ అవార్డులు ప్రకటించామని వెల్లడించారు.
Also Read
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
తాజావార్తలు
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!