YS Jagan Pulivendula Tour: 3 రోజుల పాటు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan Pulivendula Tour: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు మూడు రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రజలను కలుసుకోవడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తన పర్యటనలో భాగంగా ఈ నెల 23వ తేదీ సాయంత్రం 4 గంటలకు వైఎస్ జగన్ పులివెందులకు చేరుకోనున్నారు. అనంతరం భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించే ప్రజాదర్భార్‌లో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. రాత్రికి పులివెందులలోని తన నివాసంలో బస చేయనున్నారు.
ఇక, 24వ తేదీ ఉదయం 9 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి వేముల మండలం భూమయ్యగారిపల్లెకు చేరుకోనున్నారు. అక్కడ గట్టు లక్ష్మీనరసింహ స్వామి వారి నూతన దేవాలయ ప్రారంభోత్సవ మహోత్సవాల్లో పాల్గొంటారు. ఆలయ కార్యక్రమాలు ముగిసిన అనంతరం తిరిగి పులివెందుల క్యాంప్ కార్యాలయానికి చేరుకుని ప్రజాదర్భార్ నిర్వహించనున్నారు. అనంతరం రాత్రికి పులివెందులలోని తన నివాసంలో బస చేస్తారు. మరోవైపు, 25వ తేదీ ఉదయం 8 గంటలకు పులివెందుల నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ మూడు రోజుల పర్యటనలో ప్రజలను కలుసుకోవడంతో పాటు స్థానిక సమస్యలపై కూడా ఆరా తీసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Also Read
తాజావార్తలు
-
Varalakshmi Vratam Naivedyam Recipes : వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. 5 నైవేద్యాలు ఇలా చేస్తే టైమ్ సేవ్.!
-
Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
-
Botsa Satyanarayana: డీఎస్సీపై చర్చకు ఎందుకు రాలేదు?: సవాళ్లు మాత్రం విసురుతారు..
-
Cupid Share: కండోమ్ కంపెనీకి కాసుల వర్షం.. రాబడి ఎంతో తెలుసా!
-
AP Assembly: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. 4 రోజుల్లో 12 బిల్లులకు ఆమోదం
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!