Kadapa Police Encounter: ప్రేమోన్మాదిపై పోలీసుల కాల్పులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kadapa Police Encounter: కడప జిల్లా ఖాజీపేటలో సంచలనంగా మారిన బాలిక హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాలికను గొంతు కోసి హత్య చేసిన నిందితుడు వెంకటేష్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. నిందితుడిని పోలీసులు సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న సమయంలో పారిపోయేందుకు యత్నించడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు.. సమాచారం ప్రకారం, మైదుకూరు నుంచి నిందితుడిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న సమయంలో బసాపురం చెక్‌పోస్ట్ వద్ద వెంకటేష్ పారిపోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులపై దాడి చేయడంతో, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో నిందితుడి కాలికి గాయాలు కాగా, ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
పోలీసులకు గాయాలు
నిందితుడిని అదుపులోకి తీసుకునే సమయంలో ఇద్దరు పోలీసులకు కూడా గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని వెంటనే మైదుకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు.. ఈ ఘటనతో స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని, బహిరంగ ఉరిశిక్ష అమలు చేయాలని లేదా అతడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు హైవేపై భారీగా ధర్నా నిర్వహించారు.
Also Read
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
- YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
- YS Jagan: వైఎస్సార్ 77వ జయంతి.. ఇడుపులపాయలో నివాళులర్పించిన జగన్
- YS Jagan Pulivendula Visit: పులివెందులకు వైఎస్ జగన్.. నేడు ప్రజాదర్బార్, రేపు వైఎస్సార్‌కు నివాళి
సీఎం చంద్రబాబు స్పందన
ఇక, బాలిక గొంతు కోసి చంపిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. మహిళలు, బాలికలపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను, అధికారులను సూచించారు. మొత్తంగా బాలిక హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపగా, నిందితుడిపై జరిగిన పోలీసుల కాల్పులు మరింత చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Keerthy Suresh : వరుస ఫ్లాప్స్ నుంచి బయటపడేనా?.. కీర్తి సురేష్ ఆశలన్నీ ఆ సినిమాలపైనే!
-
Jailer 2 కలెక్షన్ల సునామీ.. తొలిరోజే రూ.125 కోట్లు.. అయినా ఆ రెండు సినిమాల రికార్డులు సేఫ్..!
-
Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఊరట.. తిరంగా మార్చ్‌పై తక్షణ ఆదేశాలకు నిరాకరణ!
-
TDP vs YCP: పుంగనూరులో ఉద్రిక్తత.. వైసీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి!
-
Punam Raut Retires: “చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా”.. రిటైర్మెంట్ ప్రకటనపై పూనమ్ భావోద్వేగం..
ట్రెండింగ్
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!