వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మరోసారి తన సొంత జిల్లా.. కడప జిల్లాలో పర్యటించబోతున్నారు.. నేటి నుంచి రెండు రోజులు కడప జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన కొనసాగనుంది.. రేపు దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు జగన్..
నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పులివెందులలో ఉన్నారు. ఈ సందర్భంగా నేడు పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వైఎస్ జగన్, ఎంపీ అవినాష్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఈ కార్యక్రమానికి రాయలసీమ జిల్లాలు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.