జమ్మలమడుగు రాజకీయాలు హిటేక్కాయి. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది... ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యా రోపణలతో విమర్శలు వర్షం కురుస్తోంది. హేమాహేమీ నేతల మధ్య మాటల యుద్ధం ఎటువైపు దారితీస్తుందోనని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలలో బీజేపీ తరుఫున ప్రచారం చేసేందుకు కేంద్ర పశు సంవర్థక, మత్స్య, సమాచార శాఖ సహాయ మంత్రి మురుగన్ రానున్నారు. తిరుపతి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన బద్వేల్ కు కేంద్ర మంత్రి మురుగన్ చేరుకోనున్నారు. అనంతరం తొలుత పార్టీ కార్యాలయంలో నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకూ రోడ్ షోలో పాల్గొని, నాలుగు రోడ్ల కూడలిలో ఆయన ప్రసంగించనున్నారు.…