NTR AI Speech: కడపలో రెండో రోజు టీడీపీ మహానాడు ప్రారంభమైంది.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ, డాక్టర్ నందమూరి తారకరామారావు 102వ జయంతి సందర్భంగా సభా వేదికపై ఆయన విగ్రహానికి నివాళులర్పించారు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్.. అయితే, మహానాడు వేదికగా ఎన్టీఆర్ ఏఐ ప్రసంగం ఎంతగానో ఆకట్టుకుంది..
మహా వేడుకలా.. నింగి నేలా పసుపు మయమై పరవశించేలా.. అంగరంగ వైభవంగా జరుగుతోన్న మహానాడు పండుగ వేళ 10 కోట్ల తెలుగు తమ్ముళ్లకు.. ఆడపడుచులకు, రైతన్నలకు, శ్రమజీవులకు, దేశవిదేశాల్లో తెలుగు కీర్తిపతాకాలుగా వెలుగొందుతున్న మన బిడ్డలకు, వివిధ రంగాలలో తమ ప్రతిభాపాటవంతో తెలుగు తల్లికి సాంస్కృతిక, సాంకేతిక, సాహిత్మ నీరాజనం ఇచ్చేన కళాకారులకు, మేధావులకు, శాస్త్రవేత్తలకు, విజ్ఞులకు, ముఖ్యంగా నా పసుపు జెండాను గుండెల మీద మోస్తున్న తెలుగుదేశం కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ఐఏ ఎన్టీఆర్.. సరిగ్గా 43 ఏళ్లు అయ్యింది నా తెలుగువారి కోసం.. నా తెలుగువారి ఆత్మగౌరవం నిలపడం కోసం.. తెలుగుదేశం పార్టీని స్థాపించి అని గుర్తుచేశారు.. నేను స్థాపించాను అనేకంటే.. పుట్టిందని చెప్పడమే సరైంది అన్నారు..
Read Also: Rohit Sharma: రోహిత్ శర్మ అంటే ఆ మాత్రం ఉంటది.. వీడియో వైరల్..!
ఇక, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినాటి నుంచి నేటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో తెచ్చిన పథకాలు, జరిగిన అభివృద్ధి.. నాడు ప్రారంభించిన పథకాలు.. నేడు చంద్రబాబు నేతృత్వంలో రూపుదిద్దుకున్న సంక్షేమ పథకాలపై ప్రశంసల వర్షం కురిపించారు ఐఏ ఎన్టీఆర్.. మరోవైపు, మానవసేవలో పార్టీ కార్యకర్తలు, సామాన్యులకు అండగా ఉంటున్న నా మనవడు లోకేష్‌ని చూస్తుంటే ముచ్చటేస్తోంది.. భళా మనవడా.. భళా అంటూ.. సాగింగి ఎన్టీఆర్ ప్రసంగం.. పూర్తి ప్రసంగం కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..