Motorola Edge 2025: 50MP ఫ్రంట్ కెమెరా, Dimensity 7400 ప్రాసెసర్, హై ఎండ్ ఫీచర్లతో మోటరోలా ఎడ్జ్ 2025 లాంచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Motorola Edge 2025: మోటరోలా తన ఎడ్జ్ సిరీస్‌లో కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ అయిన “మోటరోలా ఎడ్జ్ 2025” ను అమెరికాలో అధికారికంగా ప్రకటించింది. గతేడాది విడుదలైన మోడల్‌కు వారసంగా వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించారు. మరి ఈ మొబైల్ సంబంధించిన పూర్తి వివరాలను ఒకసారి చూద్దామా..
మోటరోలా ఎడ్జ్ 2025 ఫోన్‌లో 6.7-అంగుళాల 1.5K (2712×1220 pixels) OLED Endless Edge డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 1400 నిట్స్ HBM బ్రైట్‌నెస్, గరిష్టంగా 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో వస్తోంది. గేమింగ్‌కు అనుకూలంగా 300Hz టచ్ సాంప్లింగ్ రేట్, 720Hz PWM డిమ్మింగ్ కలిగి ఉంది. స్క్రీన్‌కు Corning Gorilla Glass 7i ప్రొటెక్షన్ ఉంది. ఈ ఫోన్ ప్రపంచంలో మొట్టమొదటి సారిగా MediaTek Dimensity 7400 4nm చిప్‌సెట్ తో వచ్చింది. దీనిలో 8GB LPDDR4X RAM, 256GB UFS 2.2 స్టోరేజ్ ఉంది. microSD కార్డ్ ద్వారా మెమరీని మరింత విస్తరించుకునే అవకాశం కూడా ఉంది.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
Read Also: Bank holidays in June: జూన్‌లో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే?
ఫొటోగ్రఫీ పరంగా మొబైల్ వెనుక భాగంలో 50MP Sony Lytia LYT-700C సెన్సార్‌తో కూడిన ప్రధాన కెమెరా (f/1.88), OIS సపోర్ట్, అలాగే 50MP అల్ట్రావైడ్ కెమెరా (f/2.0), మ్యాక్రో మోడ్ తో వస్తుంది. సెల్ఫీ కోసం ముందు భాగంలో 50MP ఫ్రంట్ కెమెరా (f/1.9) ఉంది. ఇది 4K వీడియో రికార్డింగ్ ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 5200mAh భారీ బ్యాటరీ తో వస్తోంది. ఇది 68W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆడియో పరంగా స్టీరియో స్పీకర్లు, డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, USB Type-C ఆడియో కూడా ఉంది.
Read Also: Robot Fightin: ప్రపంచంలోనే తొలిసారి.. రోబోల మధ్య బాక్సింగ్ మ్యాచ్.. ఒకరిపై ఒకరు పంచ్‌ల వర్షం
ఈ ఫోన్ Android 15 పై రన్ అవుతుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఫోన్‌కి MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, అలాగే IP68 + IP69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఉన్నాయి. ఇది 1.5 మీటర్ల లోతు నీటిలో 30 నిమిషాలపాటు ఉన్న తగిన ప్రొటెక్షన్ ఇవ్వగలదు. ఇక ఈ మోటరోలా ఎడ్జ్ 2025 ఫోన్ పాన్ టోన్ డీప్ ఫారెస్ట్ కలర్ లో అందుబాటులోకి రానుంది. దీని ధర 549.99 డాలర్స్ (సుమారు ₹46,995)గా నిర్ణయించారు. జూన్ 5 నుంచి ఈ ఫోన్ అమెజాన్, మోటోరోలాలో అన్‌లాక్‌డ్ వెర్షన్‌గా లభ్యం కానుంది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!