MP YS Avinash Reddy: జడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ.. పోలింగ్ సెంటర్ల మార్పు వ్యవహారం కాక రేపుతోంది.. అయితే, పోలీసుల సహాయంతో రిగ్గింగ్ చేయడానికే పోలింగ్ కేంద్రాలు మార్చారా? అంటూ ఫైర్ అయ్యారు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి.. జడ్పీటీసీ ఉప ఎన్నికలు, ఈసీ వ్యవహారంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. నల్గొండవారిపల్లె వాసులు ఓటు వేయాలంటే నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేయాలి.. నల్గొండవారి పల్లెలో ఎలా దాడులు చేశారో మనం చూశాం.. ఓటర్ల సౌలభ్యం కోసం పోలింగ్ కేంద్రాల మార్చడం చూశాం.. కానీ, పోలింగ్ కేంద్రం ఉన్న మార్చారు.. పోలీసులను అడ్డం పెట్టుకుని రిగ్గింగ్ చేయడానికి మార్చారా..? అంటూ మండిపడ్డారు.. 6 పోలింగ్ కేంద్రాలపై ఈ ప్రభావం ఉంది… తన ఇంటి ప్రక్కనే పోలింగ్ కేంద్రం ఉన్నా, ఆ ఓటర్ మాత్రం 4 కిలోమీటర్లు వెళ్లి ఓటువేయాలని ఆవేదన వ్యక్తం చేశారు..
Read Also: Ghati : పాపం అనుష్క.. ఎన్ని వాయిదాలు వేసినా లాభం లేకపాయే..
మా కార్యకర్తలు పై బైండోవర్ కేసులు పెట్టారు… ఎన్నికల సంఘం దృష్టికి ఈ సమస్య ను తీసుకు వెళ్లాం.. ప్రతి ఓటరు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు అవినాష్‌రెడ్డి.. 2020లో ఏ విధానం ఉంటే అదే ఇప్పుడు ఏర్పాటు చేయాలన్నారు.. టీడీపీ కుట్ర నుంచి ఎన్నికల సంఘం బయటకు రావాలని సూచించారు.. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి… ఈ అంశాన్ని కోర్టు దృష్టికి కూడా తీసుకు వెళ్లాం.. తక్షణం పోలింగ్ కేంద్రాలకు రెక్టీఫై చేయాలని కోరారు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి..
Read Also: Rahul Gandhi Asks EC: దేశానికి ఈసీ సమాధానం చెప్పాలి.. 5 ప్రశ్నలు సంధించిన రాహుల్ గాంధీ!
కాగా, పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల మార్పుపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది వైసీపీ.. గతంలో ఎర్రబెల్లి ఎంపీపీ స్కూల్ లో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని నలపరెడ్డిపల్లి జడ్పీ హైస్కూల్ కు మార్చారు.. నల్లపురెడ్డిపల్లి హైస్కూల్లో ఉన్న పోలింగ్ కేంద్రం ఎర్రబెల్లి ఎంపీపీ స్కూల్ కి మార్చారు.. మొత్తం ఆరు పోలింగ్ కేంద్రాల మార్పుపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది వైసీపీ.. దాదాపు నాలుగు వేల మంది ఓటర్లు ఇతర ప్రాంతాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవడం సాధ్యం కాదని వైసీపీ పేర్కొంది.. ఈనెల 4, 5 తేదీలలో వైసీపీ నేతలపై టీడీపీ శ్రేణులు దాడులు దిగాయని.. దీంతో ఓటర్లు ఇతర ప్రాంతాలకు వెళ్లి ఓట్లు వేయాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు అంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ప్రజలు తమ ఓటు హక్కును ఫ్రీ అండ్ ఫెయిర్ గా వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని ఎన్నికల సంఘాన్ని కోరారు వైసీపీ నేతలు..