మిస్ట్ కాల్ వస్తే దానిని కట్ చేయడం మానేసి.. అవతలి గొంతు హస్కీగా వుందని మీరు దానికి టెంప్ట్ అయితే అంతే సంగతులు. ఆ స్వరం మిమ్మల్ని పాతాళంలోకి నెట్టేస్తుంది. మహిళా గొంతుతో లక్షల్లో అక్రమ సంపాదనకు తెరతీశాడో ప్రబుద్ధుడు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో అక్రమ సంపాదన కోసం అడ్డదారి తొక్కాడు. ఆడ గొంతుతో మగాళ్లను బురిడీ కొట్టిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది.
మగాళ్లకు మిస్డ్ కాల్ చేయడం… వారితో ఆడ వారి లాగా మాట్లాడడం ఆర్థికంగా ఇబ్బందులు అని చెప్పి వారి నుంచి డబ్బులను తన అకౌంట్ లల్లో జమ చేసుకోవడం ఇది అతని నైజం. మళ్లీ వారికి ఫోన్ చేసి తన అవసరాలకు డబ్బులు కావాలని అడగడం. ఇవ్వకుంటే నువ్వు నేను సన్నిహితంగా, అసభ్యకరంగా మాట్లాడుకొన్న మాటలను సోషల్ మీడియా ద్వారా బయట పెడతా అని బ్లాక్ మెయిల్ చేయడం చేస్తున్నాడా ప్రబుద్ధుడు.
విరక్తి చెంది పోలీసులను ఆశ్రయించాడు ఓ బాధితుడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు షాకయ్యారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రాయచోటి పట్టణం బోస్ నగర్ కు చెందిన రావూరి కుమార్ అరెస్ట్ అయ్యాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 2వేల మందిని బురిడీ కొట్టించి డబ్బులు వసూళ్లు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఉమ్మడి కడప జిల్లాలో సర్ఫ్ హోల్ సెల్ వ్యాపారంతో జీవనాధారం సాగించేవాడు. వివరాలు వెల్లడించారు సీఐ సుధాకర్ రెడ్డి, నిందితున్ని రిమాండ్ కు తరలించారు పోలీసులు. నిందితుడి పట్టకోవడంలో కీలకంగా వ్యవహరించిన అర్భన్ సీఐ సుధాకర్ రెడ్డి, పట్టణ ఎస్ఐ లు నరసింహా రెడ్డి, మహమ్మద్ రఫీ, పోలీసు సిబ్బందిని అభినందించారు డీఎస్పీ శ్రీధర్. అపరిచితుల ఫోన్ కాల్స్ కి స్పందించడం, డబ్బులు పంపించడం చేయవద్దని పోలీసులు సూచించారు.