YS.Sharmila: ఏపీ ముఖ్యమంత్రి జగన్ అక్క షర్మిల. ప్రస్తుతం తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి ప్రజల మన్ననలు అందుకోవడానికి ప్రయత్నిస్తున్న విషయం తెల్సిందే. షర్మిల భర్త అనిల్ కుమార్ సైతం ఒక పాస్టర్ గా అందరికి సుపరిచితుడే.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపారు బ్రదర్ అనిల్, సీనియర్ రాజకీయ నేతలతో పాటు.. క్రిస్టియన్ నేతలు, ఎస్సీ, ఎస్సీ, బీసీ సంఘాల నేతలతో సమావేశాలు నిర్వహించారు.. ఇక, త్వరలోనే వైఎస్ షర్మిల ఏపీలోనూ కొత్త పార్టీ పెడతారనే గుసగుసలు వినిపిస్తున్నాయి… తాజాగా, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై బ్రదర్ అనిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దోషులు తప్పించుకోలేరని చెప్పారు. సీబీఐ నిష్పాక్షిక దర్యాప్తు చేస్తోందన్న ఆయన.. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. అయితే, బ్రదర్…
ఏపీలో వైఎస్ షర్మిలతో కలిసి ఆమె భర్త బ్రదర్ అనిల్ కొత్త పార్టీ పెడతారని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై బ్రదర్ అనిల్ స్పందించారు. ఏపీ వేదికగా తాము కొత్త పార్టీ పెడుతున్నామన్న విషయం పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. సోమవారం విజయవాడ వచ్చిన బ్రదర్ అనిల్ కుమార్ క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో పాటు పలు బీసీ సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో కూడా బ్రదర్ అనిల్…
తెలంగాణలో వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీ పెట్టి ప్రభుత్వంపై పోరాటం చేస్తూ వస్తున్న వైఎస్ షర్మిల.. ఆంధ్రప్రదేశ్‌లోనూ పార్టీ పెడుతున్నారా? అనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది.. ఆ మధ్య మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు కూడా సూటిగా సమాధానం చెప్పారు వైఎస్ షర్మిల. రాజకీయ పార్టీ అన్నది ఎవరైనా.. ? ఎక్కడైనా పెట్టవచ్చు అన్నారు. ఏపీలో పార్టీ పెడితే ఏమైనా తప్పా అని ఎదురు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో తాను రాజకీయ పార్టీ పెట్టకూడదని…
అంతర్జాతీయ సువార్తకులు బ్రదర్ అనిల్ కుమార్ ఉన్నట్టుండి సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ను కలిశారు.. సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు.. అయితే, ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడినా.. ఉండవల్లితో భేటీకి సంబంధించిన విషయాలను త్వరలో బయటపెడతాననడం ఆసక్తికరంగా మారింది.. కానీ, ఉండవల్లి అరుణ్ కుమార్‌ను మర్యాద పూర్వకంగానే కలిశానని.. సుమారు గంట సేపు చర్చలు జరిగాయని తెలిపిన ఆయన. తెలంగాణ, ఏపీకి సంబంధించిన రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయన్నారు.. పార్టీపరంగా, కుటుంబ…