YS Jagan Birthday: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఈరోజు (డిసెంబర్ 21) రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పటికే వైసీపీ శ్రేణులు పూర్తి స్థాయిలో సంబరాల్లో మునిగిపోయారు. డిసెంబర్ నెల ప్రారంభం నుంచే జగన్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అడ్వాన్స్ బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
Read Also: Push-Ups on Railway Bridge: పైత్యం ముదిరిందా.. బ్రిడ్జిని పట్టుకుని కిందికి వేలాడిన యువకుడు..
అయితే, రాష్ట్రవ్యాప్తంగా మాత్రమే కాకుండా విదేశాల్లోనూ వైఎస్ జగన్ బర్త్ డేవేడుకలు ఘనంగా సాగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో కేక్ కటింగ్‌లు నిర్వహిస్తూ వైసీపీ ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇక, సోషల్ మీడియా వేదికగా కూడా జగన్ పుట్టినరోజు సంబరాలు ఓ రేంజ్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో జగన్ అన్నకు శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి.
ఇక, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ పుట్టినరోజు కావడంతో వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో హడావుడి సృష్టిస్తున్నారు. జగన్ పాటలు, ప్రసంగాల డైలాగ్స్, ఫొటోలు, వీడియో షాట్స్, రీల్స్‌తో సోషల్ మీడియా మొత్తం హోరెత్తుతోంది. అభిమానులు తమ తమ స్టైల్లో క్రియేటివ్ పోస్టులు షేర్ చేస్తూ జగన్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.
మాట తప్పని.. మడమ తిప్పని ధీశాలి!
ఇచ్చిన మాట కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధపడే మన రాజన్న బిడ్డ చెప్పాడంటే చేస్తాడంతే 💫
JaganAnna 2.o Loading.. 🔥
Here's the special video to celebrate our people's leader @ysjagan's birthday. 🎉#RealVisionaryYSJagan pic.twitter.com/753absq8WF
— YSR Congress Party (@YSRCParty) December 20, 2025