YS Jagan: మద్దతు ధర కోసం రైతుల ఆందోళన.. సీఎం చంద్రబాబుకి జగన్ రిక్వెస్ట్!
- రాష్ట్రంలో కనీస మద్దతు ధర కోసం రైతుల ఆందోళనలు..
- రైతుల బాధలను సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదు..
- చంద్రబాబు రైతులను నమ్మించి మోసం చేశారు: వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: రాష్ట్రంలో కనీస మద్దతు ధరలు లభించక రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వారి గోడును సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులూ రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నారు.. మీరు, మీ మంత్రులు, అధికార యంత్రాంగం కనీసం వారివైపు కన్నెత్తి కూడా చూడకపోవడం ధర్మమేనా? అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రశ్నించారు. ఇక, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, వేరు శేనగ, టమోటా, అరటి, చీని, పొగాకు ఇలా ఏ పంట చూసినా కనీస మద్దతు ధరలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చొరవ చూపి, మార్కెట్లో జోక్యం చేసుకోవాలన్న కనీస బాధ్యతను విస్మరించారని మండిపడ్డారు. పైగా డ్రామాలతో ఆ రైతులను నిలువునా మోసం చేస్తున్నారు.. ఇది న్యాయమేనా? అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: ACB: హరిరామ్ ఆస్తులపై ఆరా తీస్తున్న ఏసీబీ..
Also Read
- Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
ఇక, మిర్చి విషయంలో కూడా చంద్రబాబు రైతులను నమ్మించి మోసం చేశారని మాజీ ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. మిర్చి కొనుగోలు అంశం కేంద్రం పరిధిలో లేకపోయినా, నాఫెడ్ కొనుగోలు చేస్తుందని మొదట నమ్మబలికారు.. క్వింటాకు రూ.11,781కు కొంటామని చెప్పి, ఒక్కపైసా కూడా ఖర్చు పెట్టకుండా రైతన్నలను మభ్యపెట్టారని తెలిపారు. అన్నం పెట్టే రైతులకు కూటమి ప్రభుత్వం సున్నం రాసిందన్నారు. మా హయాంలో ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3 వేల కోట్లు పెట్టి, ఐదేళ్లలో రూ.7, 796 కోట్లు ఖర్చు చేశాం.. చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని కనీస మద్దతు ధరల జాబితాలో లేని పొగాకు సహా అనేక పంటల రైతులను ఆదుకున్నామన్నారు. మీరు కొత్తగా ఏం చేయకపోయినా, కనీసం మా విధానాన్ని కొనసాగించి ఉంటే రైతులకు ఊరట లభించేది కదా?.. పైగా ఈ ఏడాది బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించడం దారుణమని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
Read Also: Janu : సూసైడ్ చేసుకుంటానంటూ డాన్సర్ జాను సెల్ఫీ వీడియో.. అసలు విషయం ఇదే..!
అయితే, ధాన్యం, కోకో, పొగాకు, ఆక్వా రైతులు ఆయా జిల్లాల్లో ఆందోళనలు చేస్తుంటే.. ఇప్పటికీ రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. జనాభాలో 60 శాతం మంది ప్రజలు ఆధారపడే వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అది తీవ్ర సంక్షోభానికి దారి తీస్తే, లక్షల మంది ఉపాధికి గండిపడితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? అని ప్రశ్నించారు. కాగా, వెంటనే కూటమి ప్రభుత్వం తరఫున మార్కెట్లో జోక్యం చేసుకోవాలన్నారు. కనీస ధరలు లభించని పంటల విషయంలో ప్రభుత్వమే జోక్యం చేసుకుని, మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
.@ncbn గారూ… కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వారి గోడు పట్టించుకోవడం లేదు. కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులూ రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నారు. మీరు, మీ మంత్రులు, యంత్రాంగం కనీసం వారివైపు కన్నెత్తికూడా చూడకపోవడం… pic.twitter.com/cW0REI1bV6
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 3, 2025
తాజావార్తలు
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!