Janu : సూసైడ్ చేసుకుంటానంటూ డాన్సర్ జాను సెల్ఫీ వీడియో.. అసలు విషయం ఇదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజంట్ సోషల్ మీడియా కారణంగా చాలా దారుణాలు జరుగుతున్నాయి. నటీనటులు సెలబ్రిటీల మీద పుకార్లు పుటిస్తూ అదే పనిగా వారి పై ఇష్టం వచ్చిన వీడియోలు మీమ్స్ ప్రచారం చేస్తున్నారు. ఇక తాజాగా తన వ్యక్తిగత జీవితం గురించి.. రెండో పెళ్లి గురించి మీడియా కథనాలు, సోషల్ మీడియా ట్రోలింగ్‌పై విసిగిపోయిన ఢీ డాన్సర్ జాను.. ఇక ఓపిక నశించింది బతకలేనంటూ సూసైడ్ చేసుకుంటానంటూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది..
Also Read: Sonu Nigam : నోరుజారిన సింగర్ సోను నిగమ్.. మండి పడుతున్న కన్నడ ప్రజలు
Also Read
‘నమస్తే.. బాగున్నారు కదా అందరూ.. బాగానే ఉంటారు. ఎందుకంటే పక్కోడి జీవితంతో ఆడుకున్నోళ్లంతా బాగానే ఉంటారు. జాను నవ్వితే తప్పు.. జాను ఏడిస్తే తప్పు. జాను ఒకరితో మాట్లాడితే తప్పు. జాను కూర్చుంటే తప్పు.. జాను నిలబడితే తప్పు. జాను నవ్వితే చాలు ఓవరాక్షన్ అంటున్నారు. జాను పద్ధతిగా ఉండదు. పద్ధతి నేర్చుకోవాలి.. ఇలా ఎన్ని మాటలు అంటారు. జాను ఆన్ కెమెరా ఒకలా.. ఆఫ్ కెమెరా మరోలా ఉండదు. నేను అందరితో నవ్వుతూ మంచిగా ఉంటా. వాళ్లు ఎంత పెద్దోళ్లైనా సరే.. చిన్నోళ్లైనా సరే.. వాళ్లతో మంచిగా మాట్లాడతా. అలాంటి నా గురించి తప్ప వేరే మ్యాటర్ ఉండటం లేదు. ఎందుకు నా పర్సనల్ లైఫ్‌ని తీసుకొచ్చి ఇంత హైలైట్ చేస్తున్నారు? దేని కోసం నన్ను టార్గెట్ చేస్తున్నారు?. ఎక్కడ చూసినా జానుకి రెండో పెళ్లి అంటూ నా ఫోటో పెట్టడం.. నా రెండో పెళ్లి గురించి రాసేయడం. అసలు నా పర్సనల్ లైఫ్‌ని ఎందుకు తీస్తున్నారు.
Also Read : Vijaya Devarakonda: ట్రైబల్స్ వ్యాఖ్యల వివాదంపై స్పందించిన విజయ్ దేవరకొండ
ఎవరో గుడికి పోతే రేప్ చేసి చంపేశారట. ఆ అమ్మాయి గురించి మాట్లాడొచ్చు కదా. ఆ ఎదవల గురించి మాట్లాడొచ్చు కదా.. చిన్న పిల్లల్ని చంపేస్తున్నారు వాళ్ల గురించి మాట్లాడొచ్చు కదా. సరే నా గురించి మాట్లాడుకున్నారే అనుకో .. 8 ఏళ్లుగా ఒక కొడుకుని పెంచుకుంటుంది. చాలా పద్ధతిగా ఉంటుంది. ఢీ షో లో మన తెలంగాణ అమ్మాయి విన్నర్ అయ్యిందని చెప్పుకోవచ్చు కదా. నా గురించి నా పర్సనల్ లైఫ్ గురించి ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు? ఇన్‌స్టాగ్రామ్‌లో నా వీడియోలకి గలీజ్ గలీజ్ వాయిస్‌లు పెడుతున్నారు. వాటిని నా కొడుకు చూడడా? ఫస్ట్ టైమ్ అనిపిస్తుంది నాకు వీటన్నింటికీ దూరంగా ఎక్కడికన్నా వెళ్లి చచ్చిపోవాలనిపిస్తుంది. నిజంగా నా లైఫ్‌లో ఏమీ లేకుండా ఉండి ఉంటే.. ఖచ్చితంగా చచ్చిపోయి ఉండేదాన్ని. నేను చచ్చిపోతే కారణం మీరే అవుతారు. ఇది బాగా గుర్తు పెట్టుకోండి’ అంటూ భోరుమంది. ప్రజంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
- Tags
- Janu
- Selfie Video
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!