కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, కొన్ని కులాల మీద ద్వేష భావాన్ని పెంచడానికి రఘురామకృష్ణరాజు ప్రయత్నించారు అని వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు. ప్రభుత్వం మీద ద్వేష భావాన్ని ప్రజల్లో జొప్పించాలని రఘురామకృష్ణరాజు ప్రయత్నించారు. రఘురామకృష్ణ చర్యలన్నీ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, చేస్తున్న ప్రయత్నం కాదా అని అన్నారు. రఘురామకృష్ణరాజు నియోజకవర్గానికి వెళ్తే పదిమంది కూడా రాని పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు అతని తీరు చూసి అసహ్యించుకుంటున్నారు. రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు, రాజద్రోహ పనులుకు పాల్పడ్డారనే రఘురామ కృష్ణరాజును అరెస్టు చేశారు. ఈ అరెస్టుకు, ప్రభుత్వానికి, వైసీపీ ఎటువంటి సంబంధం లేదు అని పేర్కొన్నారు.