నగరి ఎమ్మెల్యే రోజా పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రత్యర్థి వర్గం నేత, శ్రీశైలం ట్రస్టు బోర్డ్ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి. ఆయన మాట్లాడుతూ.. రోజాను రెండుసార్లు కష్టపడి మేము గెలిపించాము. అందుకు ఇప్పుడు మా చెప్పుతో మేము కొట్టుకోవాలి అన్నారు. రోజాకు ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఇండిపెండెంట్ గా నిలబడతాను. నాపై ఆమె గెలవగలదా అని ప్రశ్నించారు. ఫైర్ బ్రాండ్ అంటూ చెప్పుకోవడం కాదు. మండలంలో రోజా బలపరిచిన ఒక్క ఎంపీటీసీ మాత్రమే గెలిచారు. మేము బలపరిచిన ఆరు మంది విజయం సాధించారు. నేను కూడా వైసీపీకి విధేయుడను. ఈ గొడవ నాకు, రోజాకు తప్ప పార్టీకి సంబంధం లేదు అని స్పష్టం చేసారు చక్రపాణి రెడ్డి.