నగరి వైసీపీ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. మంత్రి రోజాపై… వైసీపీలోని ఆమె వ్యతిరేక వర్గం మళ్లీ కత్తులు దూస్తోంది. కొద్దిరోజులుగా సైలెంట్ అయ్యి కొత్త చర్చకు దారితీసిన వాళ్లంతా పాత పద్ధతిలోకి వచ్చేశారు. సై అంటే సై అంటున్నారు. తాడో పేడో తేల్చుకుంటామని సవాళ్లు విసురుతున్నారు. రోజా మంత్రి అయినా వెనక్కి తగ్గేదే లేదన్నట్టుగా మాటల తూటాలు పేల్చుతున్నారు అసమ్మతి నేతలు. 2014లో నగరి నుంచి రోజా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సమయంలో ప్రతిపక్ష పాత్రకే పరిమితం.…
నగరి ఎమ్మెల్యే రోజా పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రత్యర్థి వర్గం నేత, శ్రీశైలం ట్రస్టు బోర్డ్ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి. ఆయన మాట్లాడుతూ.. రోజాను రెండుసార్లు కష్టపడి మేము గెలిపించాము. అందుకు ఇప్పుడు మా చెప్పుతో మేము కొట్టుకోవాలి అన్నారు. రోజాకు ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఇండిపెండెంట్ గా నిలబడతాను. నాపై ఆమె గెలవగలదా అని ప్రశ్నించారు. ఫైర్ బ్రాండ్ అంటూ చెప్పుకోవడం కాదు. మండలంలో రోజా బలపరిచిన ఒక్క ఎంపీటీసీ మాత్రమే గెలిచారు. మేము…