ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు.. రూ. 48 వేల కోట్లు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించిన ఆయన.. రూ. 48 వేల కోట్ల దుర్వినియోగంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.. వైసీపీ అధికారంలోకి వచ్చాక అప్పులు – అవివీతి తప్ప మరేం జరగలేదన్న ఆయన.. ప్రభుత్వం చెప్పుకున్న స్థాయిలో సంక్షేమానికి పెద్దగా ఖర్చు పెడుతోందేంలేదన్నారు.. కోర్టుల తీర్పులపై సభలో చర్చలు…
ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. రూ. 48 వేల కోట్లు ఖర్చుకు లెక్కల్లేవంటూ నేను ఏడాది క్రితం చెప్పిన దాన్నే ఇప్పుడు కాగ్ స్పష్టంగా చెప్పింది. ప్రభుత్వం లెక్కలకు సర్టిఫికెట్ ఇవ్వడానికి కాగ్ భయపడిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవాలి. రూ. 48 వేల కోట్లంటే.. 30 శాతం మేర బడ్జెట్టుకు లెక్కల్లేవని కాగ్ స్పష్టంగా చెప్పింది. ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం లెక్కలు చూపకుండా ఖర్చు పెట్టేస్తే చూస్తూ…
ఇవాళ ఏపీ బడ్జెట్టును ప్రవేశపెట్టనున్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీలో బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్నారు. అనంతరం అసెంబ్లీలో ప్రవేశపెడతారు మంత్రి బుగ్గన. ఇదిలా వుంటే బుగ్గన నివాసానికి చేరుకున్న ఫైనాన్స్ సెక్రటరీ రావత్, ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు బడ్జెట్ గురించి చర్చించారు. బడ్జెట్ రూ.2.50 లక్షల కోట్లకు పైగా ఉండే అవకాశం వుందని తెలుస్తోంది. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్‌ను శాసనసభలో తొలుత సమర్పించనున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు,…