వైసీపీ సర్కార్ పై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల ఫైర్ అయ్యారు. అధికారం పోతుందనే భయం వైసీపీలో మొదలైందని… ఆ భయంతోనే అసెంబ్లీలో వైసీపీ అడ్డగోలుగా వ్యవహరిస్తోందని ఆగ్రహించారు. సభలో ప్రజా సమస్యలు ప్రస్తావనకు రాకుండా చేయడమే వైసీపీ ఉద్దేశమన్నారు. రంగా, మాధవరెడ్డి, మల్లెల బాబ్జీ అంశాలు ఈనాటివా..? ఆ అంశాలకు.. సభలో జరిగిన ఘటనలకు ఏమమన్నా సంబంధం ఉందా..? అని ఫైర్ అయ్యారు. తన గురించి పోరాడిన తల్లి-చెల్లికి జగన్ ఏం గౌరవం ఇస్తున్నారు..? అని ప్రశ్నించారు.
షర్మిలకు వేరే రాష్ట్రంలో పార్టీ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది..? అని… తల్లి-చెల్లిని కూడా జగన్ మోసం చేశారని చెప్పడమే తమ ఉద్దేశ్యమన్నారు. వివేకా హత్య కేసు గురించి అడిగే హక్కు ప్రతిపక్షంగా మాకుందన్నారు. చంద్రబాబు కుటుంబాన్ని అవమానించాలనే వైసీపీ ప్రీ-ప్లాన్డుగా మాధవరెడ్డి పేరును సభలో ప్రస్తావించిందని పేర్కొన్నారు. సందర్భానుసారంగా ప్రస్తావించుంటే ఏదో ఒక్కరు అంటారు తప్ప.. ముగ్గురు అదే పనిగా మాధవరెడ్డి ప్రస్తావన తేవాల్సిన అవసరం ఏముంది..? అని నిలదీశారు యనమల. వివేకా హత్య వెనుక ఎవరున్నారో కచ్చితంగా అడుగుతామని హెచ్చరించారు.