Deputy CM Pawan Kalyan: ఎన్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జనసేన పార్టీ నిర్మాణంపై ఇప్పటి వరకు నేను దృష్టి పెట్ట లేదు అని తెలిపారు. అయితే, ఇకపై పార్టీ సంస్థగత నిర్మాణంపై వర్క్ చేస్తాను అని చెప్పుకొచ్చారు. ఇక, అమరావతి రాజధాని భూ సేకరణలో ఇష్టం ఉన్న రైతులే భూములు ఇవ్వండి, బలవంతం లేదు అన్నారు. అయితే, చారిత్రక రచనలు అంటే నాకు ఇష్టం.. కానీ, చారిత్రక సినిమాలు తీయాలనే ఆలోచన ఉండేది కాదన్నారు. గతంలో ఓ పీరియాడిక్ ఫిల్మ్ ఒకటి చేయాలని అనుకున్నాను, కానీ చేయలేదు అని వెల్లడించారు. కాగా, కరోనా వేవ్స్ వల్ల హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ సమయంలో ఇబ్బంది పడ్డాం.. క్రిష్ ఈ సినిమాను తీసుకొచ్చారు.. నా ప్రాధాన్యత రాజకీయాలు.. నాకు సినిమాలు ఇంధనం.. సినిమా తప్పా నేను ఏం చేయలేను అని ఉప ముఖ్యమంత్రి పవన్ చెప్పుకొచ్చారు.
Read Also: AP Deputy CM Pawan: లిక్కర్ కేసులో జగన్ అరెస్ట్ పై ఇప్పుడే ఏం మాట్లాడలేను..
అయితే, నాగబాబుకు మంత్రి పదవిపై ఇప్పటి వరకు చర్చ జరగలేదు.. దానిపై నేనే నిర్ణయం తీసుకోవాలి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ అంశంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు తీసుకోవాల్సి నిర్ణయం తీసుకున్నారు.. కానీ, రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇబ్బందులు తప్పవు అన్నారు. కాగా, జనసేన పార్టీ గ్రౌండ్ లెవెల్ లో పటిష్టం చేస్తాను.. ఆ తర్వాత ఆగస్టులో పదవుల విస్తరణ అనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటాను అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో మాకు పట్టు ఉన్న ప్రాంతాల్లో కూడా పార్టీని పటిష్టం చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నాం.. అందుకోసం ప్రత్యేక ప్లాన్ రూపొందించామని పవన్ పేర్కొన్నారు.