NTV Telugu Site icon

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* తిరుపతి స్వీమ్స్ హాస్పిటల్ లో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం.

* తిరుపతి భాకరాపేటలో నేడు కేంద్ర వ్యవసాయ పతాకాలపై అవగాహన కార్యక్రమం

* చిలకలూరిపేటలో గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొననున్న మంత్రి విడదల రజని

* కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ఉట్రూమిల్లి లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్

*అనంతపురం కో ఆపరేటివ్ అర్భన్ బ్యాంకు ఎన్నికలకు సర్వం సిద్ధం. ఇవాళ పోలింగ్. బరిలో 31 మంది అభ్యర్థులు. 200 మంది పోలీసులతో బందోబస్తు. ఓట్ల లెక్కింపుపై హైకోర్టు స్టే

*విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీ మృతిపై నేడు మేజిస్టీరియల్ విచారణ జరపనున్న ఆర్.డీ.ఓ. ఫిబ్రవరి 28న చికిత్స పొందుతూ మరణించిన ఖైదీ రమేష్.

*నేడు విశాఖకు రానున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్. నాలుగు రోజుల పాటు వివిధ ప్రాంతాల సందర్శన

*నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో గరీబ్ కళ్యాణ సమ్మేళన కార్యక్రమం. ముఖ్యఅతిథిగా హాజరుకానున్న కేంద్ర మంత్రివర్యులు రాజీవ్ చంద్రశేఖర్.

*విశాఖలో కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాలా రెండో రోజు పర్యటన. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో ప్రధాని నిర్వహించే వర్చువల్ కాన్ఫరెన్స్.

*పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ మావుళ్ళమ్మ ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు. జూన్ 1 నుంచి 27 వ తేదీవరకు శ్రీ మావుళ్ళమ్మ జ్యేష్ట మాస ఉత్సవాలు.

*నంద్యాల జిల్లా సిద్దేశ్వరం ప్రాజెక్టు సాధన సమితి ఆధ్వర్యంలో సిద్దేశ్వరం వద్ద జలదీక్ష. 144వ సెక్షన్ విధించిన పోలీసులు

*నేటి సాయంత్రం 6 గంటల వరకు కోనసీమ జిల్లాలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేత. అమలాపురం అల్లర్ల నేపధ్యంలోవారం రోజులుగా నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు