What’s Today:
• ఢిల్లీ: నేడు రాంలీలా మైదానంలో రావణ దహనం కార్యక్రమం.. హాజరుకానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, హీరో ప్రభాస్.. ఆదిపురుష్ సినిమాలో రాముడిగా నటించిన ప్రభాస్.. కోవిడ్‌తో రెండేళ్లుగా రావణ దహనం నిర్వహించని రాంలీలా కమిటీ
• హైదరాబాద్: ఈరోజు ఉ.11 గంటలకు తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం.. 283 మంది ప్రతినిధులకు ఆహ్వానం.. సమావేశంలో టీఆర్ఎస్ పేరు మార్పు తీర్మానంపై సంతకాల సేకరణ.. ఈ భేటీ తర్వాత ప్రతినిధులు, అతిథులకు ప్రగతి భవన్‌లో లంచ్.. లంచ్ తర్వాత కేసీఆర్ మీడియా సమావేశం.. మధ్యాహ్నం 1:19 గంటలకు టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు.. కొత్త పేరు ప్రకటన..
• తిరుమల: నేటితో ముగియనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. ఉ.9 గంటల వరకు పుష్కరిణిలో శ్రీవారి చక్రస్నానం.. ఉ.7:50 గంటల నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో చక్రత్తాళ్వార్‌కు అవభృద స్నానం.. రాత్రి 9 గంటలకు ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాల ముగింపు
• శ్రీశైలంలో చివరిరోజు దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు.. సాయంత్రం భ్రమరాంబికాదేవి భక్తులకు నిజ దర్శనం.. నందివాహనంపై పూజలందుకోనున్న స్వామి, అమ్మవార్లు.. రాత్రికి అమ్మవారి తెప్పోత్సవం
• సత్యసాయి జిల్లా: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఘనంగా దసరా వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న ప్రశాంతి నిలయం.. వివిధ రకాల పూలతో ముస్తాబైన సత్యసాయి మహాసమాధి
• కాకినాడ: నేటి నుంచి జగ్గంపేట నియోజకవర్గంలో టీడీపీ ఆధ్వర్యంలో పాదయాత్ర.. ప్రభుత్వ నిర్ణయాలకు నిరసనగా నియోజకవర్గంలో పాదయాత్ర చేయనున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్