* నేడు SLBCకి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్.. SLBC టన్నెల్ కూలిన నేపథ్యంలో సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయం.. టన్నెల్ పూర్తి చేయడానికి కొత్త మార్గాల అన్వేషణలో భాగంగా సర్వే.. ఇవాళ మధ్యాహ్నం 2గంటలకి సీఎం రేవంత్ ప్రెస్ మీట్..
* నేటి నుంచి తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల నిరవధిక బంద్.. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో సమ్మె.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్..
* నేడు లండన్ లో ఏపీ సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన.. వివిధ పరిశ్రమలు, సంస్థలకు చెందని ప్రతినిధులను కలవనున్న సీఎం చంద్రబాబు.. పారిశ్రామికవేత్తలతో సీఐఐ నేతృత్వంలో జరగనున్న రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.. లండన్ లోని ఇండియన్ హైకమిషనర్ దొరైస్వామితో భేటీ కానున్న చంద్రబాబు..
* నేడు కాకినాడ జిల్లాలో కేంద్ర బృందం పర్యటన.. మొంథా తుఫాన్ తో దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్న బృందం.. కాకినాడ జిల్లాలో 41 వేల ఎకరాల పంట నష్టం..
* నేడు కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద దగ్ధమైన ట్రావెల్స్ బస్సును పరిశీలించనున్న కేంద్ర అధికారుల బృందం.. అక్టోబర్ 24న బస్సు దగ్ధమై 19 మంది సజీవ దహనం.. కేంద్ర ప్రభుత్వ అధికారులకు ప్రమాదం వివరాలు ఇవ్వనున్న ఏపీ అధికారులు..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 6 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.. టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం..
* నేడు మూడో రోజుకు చేరుకున్న కోటి దీపోత్సవం.. మూడవ రోజు విశేష కార్యక్రమాలు.. జగద్గురు శ్రీ అభినవోద్దండ విద్యాశంకరభారతీ మహాస్వామీజీ, శ్రీశ్రీ శ్రీ శ్రీ గోవిందానంద సరస్వతీ మహాస్వామీజీల చేత అనుగ్రహ భాషణం.. ప్రవచనామృతం, బ్రహ్మశ్రీ డా. మైలవరపు శ్రీనివాసరావు.. వేదికపై పూజ, వారణాసి శ్రీ విశ్వనాథునికి కోటి బిల్వార్చన, అద్భుతరీతిలో కాశీ – సప్తరుషి హారతి, భక్తులచే పూజ శివలింగాలకు కోటి బిల్వార్చన.. కల్యాణం, రామేశ్వరం శ్రీ రామనాథస్వామి కల్యాణం.. మయూర వాహనం