* నేడు తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన.. ఉదయం 9 గంటలకు తిరుపతి చేరుకోనున్న సీఎం చంద్రబాబు.. ఉదయం 10 గంటలకు జాతీయ మహిళా సదస్సులో పాల్గొననున్న చంద్రబాబు.. మధ్యాహ్నం లోక్ సభ స్పీకర్ సహా ప్రతినిధులతో కలిసి భోజనం..
* నేడు తిరుపతిలో జాతీయ మహిళా సాధికారత సదస్సు.. దేశంలోని 31 అసెంబ్లీలోని మహిళా సాధికారత కమిటీల ప్రతినిధులు హాజరు.. పాల్గొననున్న డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, టీటీడీ చైర్మన్ తదితరులు..
* నేడు విశాఖలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన.. రైల్వే గ్రౌండ్ లో బీజేపీ సారధ్యం బహిరంగ సభ.. ముఖ్య అతిథిగా పాల్గొననున్న బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డా.. పార్టీ సంస్థగత విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై చర్చ.. అనంతరం స్టేట్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో పాల్గొననున్న జేపీ నడ్డా..
* నేడు తెలంగాణ విమోచనంపై ఫొటో ఎగ్జిబిషన్.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఫొటో ఎగ్జిబిషన్.. ప్రారంభించనున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. పాల్గొననున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..
* నేడు హైదరాబాద్లో మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు.. హైదరాబాద్ పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు..
* నేడు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. తెలంగాణలోని ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు.. సిరిసిల్లా, కరీంనగర్, ములుగు, కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. మిగిలిన అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. ఏపీలోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలకు భారీ వర్ష సూచన.. దక్షిణకోస్తా, తిరుపతిలో విస్తారంగా వర్షాలు..
* నేడు నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీల కార్కీ ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశం.. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ, నిషేధం ఎత్తివేత.. అల్లర్లలో గాయపడిన యువకులను పరామర్శించిన కార్కీ..
* నేడు ఆసియా కప్ లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ మ్యాచ్.. దుబాయ్ వేదికగా రాత్రి 8గంటలకు మ్యాచ్..