CM Chandrababu: హంద్రీనీవాకు ఏపీ సీఎం చంద్రబాబు నీటిని విడుదల చేశారు. కృష్ణా జలాలు జలహారతి ఇచ్చి రెండు మోటార్లను ఆన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019లో ఒక్క ఛాన్స్ అంటూ వచ్చారు.. వచ్చాక నరుకుడే నరుకుడు మొదలు పెట్టారు.. హంద్రీనీవాపై ఒక్క రూపాయి అయినా ఖర్చు చేశారా.. సినిమా సెట్టింగులు వేసి డ్రామాలు ఆడారని మండిపడ్డారు. ఇక, గట్టిగా కళ్లు మూసుకుంటే మూడేళ్లలో చంద్రబాబు ఎగిరిపోతాడు అని వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై కూడా సీఎం కౌంటర్ ఇచ్చారు. క్లైమోర్ మైన్సే నన్ను ఏం చేయలేదు.. జగన్ లాంటి వాళ్లు నన్ను ఏం చేయలేరు అని ధీమా వ్యక్తం చేశారు. తిట్లు, శాపనార్ధాలు నాకు తాకవు అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
Read Also: Nidhhi Agerwal : వేరే వంద సినిమాలు చేసినా పవన్ తో ఒక్క సినిమా చేసినా ఒకటే!
ఇక, రాయలసీమ గురించి మాట్లాడతారు, కులాలను, మతాలను రెచ్చగొడతారు అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రూ. 2,500 కోట్లు ఖర్చు చేసేందుకు మనసు రాలేదు.. కుప్పంలో డ్రామా ఆడారు, సినిమా సెట్టింగ్ వేశారు.. హంద్రీనీళ్లు తెచ్చామని ట్యాంకర్లతో తొలుత ప్రారంభించారు.. వాళ్ళు ఉండగానే నీళ్లు ఇంకిపోయాయని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులను చేరబట్టింది వైసీపీ.. ఎగువన కురిసి వర్షాలతో అగష్టులో రావాల్సిన నీళ్లు జూలైలోనే వచ్చాయి.. పోలవరం పూర్తి చేసుకుని నదులు అనుసంధానం చేస్తామన్నారు. రాయలసీమలో జలాశయాలు కళకళలాడుతున్నాయి.. రాయలసీమ రాళ్లసీమకాదు.. రతనాల అవుతుంది అన్నారు. రాయలసీమకు నీళ్లిచ్చే కార్యక్రమంలో ఉన్న తృప్తి జీవితంలో మర్చిపోలేను.. రాయలసీమను మార్చేది నీళ్లు.. రాయలసీమ కరువు, కష్టాలు తెలిసిన వ్యక్తిని.. రాయలసీమలో పెట్టుబడికి డబ్బులు లేకుంటే ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చే సంస్కృతికి శ్రీకారం చుట్టాను.. రాయలసీమ రాళ్లసీమగా, ఎడారిగా మారుతుందని, ఎవరూ కాపడలేరని అన్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
Read Also: Vivo T4R 5G: అతిసన్నని క్వాడ్ కర్వ్ డిస్‌ప్లేతో మంత్రముగ్ధులను చేయడానికి సిద్దమైన వివో T4R..!
అయితే, రాయదుర్గం ప్రాంతంలో ఎడారి ఛాయలు కనిపిస్తే వందల కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాయలసీమ చరిత్ర తిరగరాయడానికి శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్.. ఎన్టీఆర్ హయంలో హంద్రీనీవా, గాలేరు నగరికి శ్రీకారం చుట్టారు.. 1995లో ఉరవకొండలో హంద్రీనీవాకు శ్రీకారం చుట్టాను.. హంద్రీనీవా సాధ్యం కాదన్నారు, 540 కిలో మీటర్ల దూరం కాలువ ఉంది.. ఇపుడు 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాయలసీమ చరిత్రలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వగలమని ధైర్యంగా చెప్పగలుగుతున్నామని పేర్కొన్నారు. సవాళ్లు స్వీకరించడం నాకు కొత్తకాదు.. కియా పరిశ్రమ వేరే రాష్ట్రాలకు వెళ్తుంటే ఏపీకి ఆహ్వానించాను.. నీళ్లు లేవు, పరిశ్రమ ఎక్కడ పెడతామని ప్రశ్నించారు.. గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మించి కరువు సీమలో కియా పరిశ్రమ నిర్మించి చూపించామని చంద్రబాబు వెల్లడించారు.