Minister Nimmala Ramanaidu: జూన్ నాటికల్లా లబ్దిదారులకు టిడ్కో ఇళ్లు..
- వచ్చే జూన్ నాటికల్లా మిగిలిన టిడ్కో ఇళ్లు పూర్తి..
- లబ్ధిదారులకు అందరికీ అప్పగించేలా పనులు చేస్తున్నామన్న నిమ్మల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nimmala Ramanaidu: వచ్చే జూన్ నాటికల్లా మిగిలిన టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందరికీ అప్పగించేలా పనులు జరుగుతున్నాయన్నారు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు.. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఎన్టీఆర్ టిడ్కో గృహాల సముదాయ కాలనీ ప్రాంతంలో, నర్సాపురం ప్రధాన కాలువపై రూ. రెండు కోట్లతో వంతెన నిర్మాణానికి మంత్రులు సత్య కుమార్ యాదవ్, రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ.. వచ్చే జూన్ నాటికల్లా మిగిలిన టిడ్కో గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందరికీ అప్పగించేలా పనిచేస్తున్నాం అన్నారు..
Read Also: Bharat Ane Nenu: మహేష్ బాబు ఫ్యాన్స్‌తోనే కామెడీనా?.. ఫైట్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తారో!
Also Read
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Case Filed Against Janasena ZPTC: నమ్మించి మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు.. జనసేన జడ్పీటీసీపై కేసు నమోదు..
- Agarbatti Scam: అగరబత్తీల తయారీ పేరుతో రూ. 25 కోట్ల కుచ్చు టోపీ.. జాగ్రత్త సుమీ.!
- Fog: వేసవిలోనూ దట్టమైన పొగమంచు.. ఏం వాతావరణ మార్పులో ఏమో..!
గత టీడీపీ ప్రభుత్వంలో 90 శాతం పూర్తి చేసిన ఇళ్లను వైఎస్ జగన్ ప్రభుత్వంలో ధ్వంసమయ్యాయని ఆరోపించారు నిమ్మల రామానాయుడు.. టీడీపీ ప్రభుత్వంలో పూర్తయిన ఇళ్లను వైసీపీ ప్రభుత్వం బ్యాంకులో తాకట్టు పెట్టి, 5 వేల కోట్లను దారిమళ్లించి లబ్ధిదారుల నెత్తిన అప్పు భారం మోపారని జగన్‌పై ఫైర్ అయ్యారు.. 2019 ఎన్నికల్లో టిడ్కో గృహాలను ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక గాలికి వదిలేసి లబ్ధిదారులను దగా, మోసం చేసిన వ్యక్తి వైఎస్ జగన్ అని దుయ్యబట్టారు.. గత వైసీపీ ఐదేళ్ల పాలనలో అర్ధ రూపాయి పని, అరబస్త సిమెంట్ పని నోచుకోకపోగా విధ్వంసానికి గురయ్యాయని సంచలన ఆరోపణలు చేశారు.. అయితే, చంద్రబాబు లబ్ధిదారులను ఆదుకోవాలనే ఉద్దేశంతో, లబ్ధిదారుల బ్యాంకు రుణాలకు సంబంధించి రూ.140 కోట్లు మంజూరు చేశారని వివరించారు మంత్రి నిమ్మల రామానాయుడు..
Read Also: OnePlus 13 Mini: 6000mAh బ్యాటరీతో OnePlus 13 మినీ స్మార్ట్‌ఫోన్.. త్వరలో లాంచ్
తాజావార్తలు
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
-
Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
-
EPFO: ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు.. UAN యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు
-
Green SM Limo: ఓలా-ఉబర్‌లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్‌పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..