AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: ఆంధ్రప్రదేశ్‌లో దారుణమైన ఘటన వెలుగు చూసింది.. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికపై నలుగురు యువకులు మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.. పోలీసుల వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన వెంకట గణేష్, బడేటి దుర్గ మహేష్, దేవరకొండ భోగేశ్వరరావు, ఆకుల లక్ష్మణ్ అనే నలుగురు యువకులు 2024 సంవత్సరం నుంచి బాలికను మోసం చేసి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అయితే, ఇటీవల బాలిక ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆమె తల్లిదండ్రులు భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బాలిక ఐదో నెల గర్భిణి అని నిర్ధారించారు. దీంతో షాక్‌కు గురైన తల్లిదండ్రులు బాలికను నిలదీయగా జరిగిన ఘటన మొత్తాన్ని ఆమె వెల్లడించినట్లు సమాచారం. ఈ ఘటనపై బాలిక తల్లి పాలకోడేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అయితే, ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేయడంతో పాటు మహిళల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Also Read
- Aqua Farmers: ఆక్వా రైతులకు మరోషాక్.. మూడు నెలల్లో రెండో సారి..
- Case Filed Against Janasena ZPTC: నమ్మించి మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు.. జనసేన జడ్పీటీసీపై కేసు నమోదు..
- Agarbatti Scam: అగరబత్తీల తయారీ పేరుతో రూ. 25 కోట్ల కుచ్చు టోపీ.. జాగ్రత్త సుమీ.!
- Fog: వేసవిలోనూ దట్టమైన పొగమంచు.. ఏం వాతావరణ మార్పులో ఏమో..!
తాజావార్తలు
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..