Case Filed Against Janasena ZPTC: నమ్మించి మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు.. జనసేన జడ్పీటీసీపై కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Case Filed Against Janasena ZPTC: ఈ మధ్య జనసేన పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు వివిధ ఘటనల్లో చిక్కుకోవడం రాజకీయంగా ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది.. అయితే, తాజాగా, పశ్చిమగోదావరి జిల్లాలో జనసేనకు చెందిన జడ్పీటీసీపై మహిళ చేసిన ఫిర్యాదు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. వీరవాసరం మండలానికి చెందిన జనసేన జడ్పీటీసీ గుండా జయప్రకాశ్ నాయుడుపై భీమవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు, జయప్రకాశ్ నాయుడు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా దగ్గరై, అనంతరం మోసం చేశాడని ఆరోపించింది. తాను వివరణ కోరగా దాడికి కూడా పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. ఈ ఆరోపణలకు సంబంధించి ఆమె కొన్ని ఫొటోలు, వీడియోలను కూడా విడుదల చేసినట్లు సమాచారం.
Also Read
ఈ ఘటనపై మహిళ భీమవరం టూ టౌన్ పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో సెక్షన్ 69తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇక, ఈ ఆరోపణలపై స్పందించిన జడ్పీటీసీ గుండా జయప్రకాశ్ నాయుడు, తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తన రాజకీయ ఎదుగుదలను తట్టుకోలేక కొందరు కావాలనే ఈ ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయం పూర్తిగా తన వ్యక్తిగతమని, దీనిని పార్టీకి లేదా జనసేన అధినేతకు అన్వయించడం సరికాదని చెప్పారు. అలాగే, ఒక స్థల వివాదం నేపథ్యంలో తనపై తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని ఆరోపించిన జయప్రకాశ్ నాయుడు, ఈ విషయంపై న్యాయపరంగా పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!