Deputy CM Pawan: భీమవరం డీఎస్పీ తీరుపై ఎస్పీతో చర్చించిన డిప్యూటీ సీఎం పవన్
- భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా..
- డీఎస్పీ తీరుపై పశ్చిమ గోదావరి ఎస్పీతో చర్చించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
- పోలీసులు సివిల్ వివాదాలలో జోక్యం చేసుకోవద్దు: ఉప ముఖ్యమంత్రి పవన్
Deputy CM Pawan: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కి అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీంతో భీమవరం డీఎస్పీ పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోయినట్లు, సివిల్ వివాదాలలో సదరు అధికారి జోక్యం చేసుకుంటున్నారని, కొందరి పక్షం వహిస్తూ కూటమి నేతల పేరు వాడుతున్నారనే తరహా ఫిర్యాదులు డిప్యూటీ సీఎం పవన్ దృష్టికి వచ్చాయి. ఇక, ఈ విషయంపై పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో ఈ అంశంపై ఫోన్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులు ప్రస్తావించి డీఎస్పీ వ్యవహార శైలిపై నివేదిక పంపించాలని ఆదేశాలు జారీ చేశారు.
Read Also: President of India Building: శబరిమలలో అధికారిక రాష్ట్రపతి భవన్.. నేపథ్యం ఇదే..!
Also Read
- Case Filed Against Janasena ZPTC: నమ్మించి మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు.. జనసేన జడ్పీటీసీపై కేసు నమోదు..
- Agarbatti Scam: అగరబత్తీల తయారీ పేరుతో రూ. 25 కోట్ల కుచ్చు టోపీ.. జాగ్రత్త సుమీ.!
- Fog: వేసవిలోనూ దట్టమైన పొగమంచు.. ఏం వాతావరణ మార్పులో ఏమో..!
- Nandi Idol Damaged: భీమవరం పంచారామ క్షేత్రంలో అపచారం.. నంది విగ్రహం ధ్వంసం..
ఇక, అసాంఘిక వ్యవహారాలకు డీఎస్పీ స్థాయి అధికారి అండగా ఉండటాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చకుండా చూడాలన్నారు. ఈ తరహా వ్యవహారాలను కూటమి ప్రభుత్వం ఉపేక్షించదనే విషయాన్ని సిబ్బందికి తెలియజేయాలన్నారు. ప్రజలందరినీ సమదృష్టితో చూసి శాంతి భద్రతలను పరిరక్షించాలని దిశానిర్దేశం చేశారు. అలాగే, భీమవరం డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను రాష్ట్ర హోం శాఖ మంత్రి అనితకు, రాష్ట్ర డీజీపీకి తెలియజేయాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Dubbing Movies : అర్థంకాని టైటిల్స్ పెట్టి నష్టపోతున్న నిర్మాతలు
-
India Ship: హార్మూజ్ జలసంధి దాటిన భారత్‌కు వస్తున్న LPG క్యారియర్.. మే 13న విశాఖకు!
-
Mumbai Indians: ఓటమిలోనూ వరల్డ్ రికార్డ్.. టీ20 క్రికెట్ చరిత్రలో తొలి జట్టుగా ముంబై ఇండియన్స్
-
Ruturaj Gaikwad: ముంబైని ముంచిన చెన్నై వ్యూహం.. సీఎస్కే గెలుపు రహస్యం చెప్పిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్
-
Trisha Karuppu: వయసు రివర్స్ అవుతోంది.. త్రిష బ్యూటీపై ఫ్యాన్స్ ఫిదా! కానీ మేకర్స్‌తో గొడవ ఏంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!