AP Panchayat Elections: రసవత్తరంగా పంచాయతీ పోరు.. ఏకగ్రీవం చేస్తే ఎకరం పొలం.. రూ.50 లక్షల ఆఫర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల హడావిడి కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ముగిసిపోగా.. ఇక పంచాయతీ ఎన్నికలకు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ సన్నాహాలు చేస్తోంది.. అయితే, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారింది. సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేస్తే గ్రామానికి భారీగా నిధులు, ఆస్తులు ఇస్తామంటూ అభ్యర్థులు ముందుకు వస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఒక అభ్యర్థి ఏకంగా రూ.50 లక్షలు ఇస్తానని ప్రకటించగా.. మరో అభ్యర్థి ఎకరం పొలం ఇస్తానని ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
నరసాపురం మండలం తూర్పుతాళ్లు గ్రామ పంచాయతీ ఎన్నిక ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. సర్పంచ్ పదవి కోసం పలువురు అభ్యర్థులు పోటీకి సిద్ధమవుతున్నారు. అయితే ఎన్నికలు జరిగితే లక్షల రూపాయలు ఖర్చవడమే కాకుండా, గ్రామంలో ఇప్పటివరకు కొనసాగుతున్న ఐక్యత దెబ్బతింటుందని గ్రామ పెద్దలు భావించారు. దీంతో ఎన్నికను ఏకగ్రీవం చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా ఇటీవల పార్టీలకు అతీతంగా గ్రామ పెద్దలు సమావేశమయ్యారు. పోటీలో ఉన్న అభ్యర్థులతో చర్చలు జరిపారు. ఎన్నికల కోసం అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం, గ్రామంలో వర్గ విభేదాలు పెంచుకోవడం కంటే అందరూ కలిసి ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకోవడం మంచిదని అభిప్రాయపడ్డారు. ఏకగ్రీవానికి సహకరించే అభ్యర్థులు గ్రామ అభివృద్ధికి ఎంతమేరకు సహకరిస్తారు? గ్రామంలోని ఆలయాలు, చర్చిలు, ఇతర ప్రార్థనా మందిరాలకు ఏమి చేస్తారు? అని పెద్దలు అభ్యర్థులను ప్రశ్నించారు.
Also Read
- Aqua Farmers: ఆక్వా రైతులకు మరోషాక్.. మూడు నెలల్లో రెండో సారి..
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Case Filed Against Janasena ZPTC: నమ్మించి మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు.. జనసేన జడ్పీటీసీపై కేసు నమోదు..
- Agarbatti Scam: అగరబత్తీల తయారీ పేరుతో రూ. 25 కోట్ల కుచ్చు టోపీ.. జాగ్రత్త సుమీ.!
ఈ సందర్భంగా ఒక అభ్యర్థి గ్రామానికి రూ.50 లక్షలు ఇస్తానని ముందుకు వచ్చినట్లు సమాచారం. మరో అభ్యర్థి ఏకంగా ఎకరం పొలం ఇస్తానని ప్రకటించినట్లు తెలుస్తోంది. దీంతో తూర్పుతాళ్లు పంచాయతీ ఎన్నికల వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. అభ్యర్థులు గ్రామానికి ఇచ్చే హామీలు ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని గ్రామ పెద్దలు భావిస్తున్నారు. ఎవరైనా నామినేషన్ దాఖలు చేసినా వారితో మాట్లాడి ఉపసంహరించుకునేలా ప్రయత్నించాలని నిర్ణయించారు. ఏకాభిప్రాయం కుదరకపోతే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని కూడా భావిస్తున్నారు. ఈసారి తూర్పుతాళ్లు పంచాయతీ సర్పంచ్ పదవి ఓసీ జనరల్‌కు కేటాయించారు. కూటమి పార్టీలకు మద్దతుగా ఉన్న ఈ గ్రామంలో ప్రస్తుతం ముగ్గురు అభ్యర్థులు పోటీకి సిద్ధమవుతున్నారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం కొనసాగాలని, ప్రజల మధ్య ఐక్యత దెబ్బతినకూడదనే ఉద్దేశంతో పెద్దలు చేస్తున్న ఏకగ్రీవ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. నామినేషన్ల గడువు ముగిసిన తర్వాతే దీనిపై పూర్తి స్పష్టత రానుంది.
తాజావార్తలు
-
AP Panchayat Elections: రసవత్తరంగా పంచాయతీ పోరు.. ఏకగ్రీవం చేస్తే ఎకరం పొలం.. రూ.50 లక్షల ఆఫర్!
-
108 కి.మీ రేంజ్, 16 ఇంచుల భారీ వీల్స్‌తో Yamaha Xenter E కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..!
-
Jammu Kashmir: జమ్ము కశ్మీర్లో తీవ్ర కలకలం.. అదృశ్యమైన ఇద్దరు పోలీసుల మృతదేహాలు లభ్యం..
-
AP Crime: జనసేన పార్టీ పేరుతో భారీ మోసం.. 20 మందికి రూ.7 కోట్ల టోకరా!
-
Donald Trump: ఇరాన్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. 93 శాతం కాదు, 100 శాతం విజయం సాధిస్తాం!
ట్రెండింగ్
-
Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కి మరోసారి కెప్టెన్‌గా రోహితేనా..? స్టార్ ప్లేయర్ నోరుజారడంతో లీకైన అసలు మ్యాటర్..
-
Airtel Beats Jio: జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్, నెట్వర్క్ క్వాలిటీలో నెం.1గా..!
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!