పశ్చిమ గోదావరి జిల్లా నుండి అస్సాం,పశ్చిమ బెంగాల్, బoగ్లాదేశ్ లకు చేపల ఎగుమతులు నిలిచిపోయాయి. లోకల్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉండటంతో ఏపీ సరుకును కొనుగోలు చేయడం లేదు పశ్చిమ బెంగాల్. దాంతో ప్రతి రోజు 2500 టన్నుల చేపల ఎగుమతులు నిలిచిపోతున్నాయి. ఇతర రాష్ట్రాలకు చేపల ఎగుమతులు నిలిచిపోవటం తో లబోదిబో మంటున్నారు చేపల పెంపకందారులు. ఎగుమతులు నిలిచిపోవటం తో రైతుల వద్ద కొనుగోళ్ళకు ముందుకు రావడం లేదు బయ్యర్లు. దాంతో మార్కెట్ వాల్యూ భారీగా పడిపోయింది. కేజీ చేపల రేటు 110 నుండి 87 కి వచ్చింది. దాంతో తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.