ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వివో మరో కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది. బడ్జెట్ ధరలోనే పవర్ ఫుల్ ఫీచర్లతో రిలీజ్ చేయనుంది. వివో తాజాగా కొత్త Vivo T4x 5G స్మార్ట్ ఫోన్ రిలీజ్ డేట్ ను ప్రకటించింది. మార్చి 5న వివో భారత్ లో వివో T4x 5Gని విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ ఆధునిక ఫీచర్లు, శక్తివంతమైన ప్రాసెసర్, పవర్ ఫుల్ బ్యాటరీతో స్మార్ట్ ఫోన్ లవర్స్ ను అట్రాక్ట్ చేయనుంది.
Also Read:Minister Narayana: గత ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదు.. నిధులను డైవర్ట్ చేశారు..
భారత్ లో ఈ ఫోన్ రూ. 13,000 కంటే తక్కువ ధర పరిధిలో లాంచ్ అవుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ధరకు ఫోన్ 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లాంచ్ అవుతుందని టీజర్ వెల్లడించింది. ఈ ఫోన్‌లో 6500mAh బ్యాటరీ ఉంటుందని టాక్. స్పీకర్, USB టైప్ C పోర్ట్, మైక్రోఫోన్ ఫోన్ దిగువన ఉంటాయి. ఈ ఫోన్ ప్రోంటో పర్పుల్, మెరైన్ బ్లూ షేడ్స్‌లో లాంచ్ అవుతుందని సమాచారం. Vivo T4x 5G 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల FHD+ డిస్‌ప్లే, 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ని కలిగి ఉండవచ్చు.
Also Read:Kedar: 10 మంది మాజీ ఎమ్మెల్యేలకు, 4 నిర్మాతలకు బినామీగా కేదార్?
AI ఫంక్షనాలిటితో కూడిన 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరా ఉంటుంది. వివో ఈ ఫోన్‌ను మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, IR బ్లాస్టర్ ఫీచర్ తో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ గీక్‌బెంచ్ డేటాబేస్‌లో MediaTek Dimensity 7300 చిప్‌సెట్‌తో 8GB వరకు RAMతో రానున్నట్లు తెలుస్తోంది. Vivo T4x 5G ఆండ్రాయిడ్ 15 తో రావచ్చు. ఇది FuntouchOS 15 ఆధారంగా పనిచేయనున్నట్లు తెలుస్తోంది.